Breaking News

P. L. Narayana: ఊహ మేనమామ ఎంత పెద్దనటుడో తెలుసా?


తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది సినీ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీల నుండి వచ్చి హీరో హీరోయిన్లుగా స్థిరపడిన వారు ఉన్నారు. ఇప్పుడంటే కొద్దిగా ట్రైనింగ్ తీసుకుని వచ్చేస్తున్నారు గానీ.. మూడు నాలుగు దశాబ్దాల క్రితం నాటకాల్లో ఆరితేరిన వారే ఎక్కువగా సినిమాలలో రాణించేవారు. ఈ కోవలోనే ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలో నిలదొక్కుకున్న వ్యక్తి . మలయాళీ కుటుంబానికి చెందిన ఆయన గుంటూరులో పుట్టి పెరిగారు. బాపట్లలో విద్యాభ్యాసం తర్వాత ఒంగోలు వెళ్లి నాటకాలు వేశారు. ఆయన నటించిన ‘కుక్క’ అనే నాటకానికి జాతీయ అవార్డు దక్కింది. అదే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు.. ఇలా ఏ పాత్రలో నటించినా దానికి వంద శాతం న్యాయం చేయడమే అయనకు తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిసి సుమారు 300 సినిమాల్లో నటించారు. అసలు విషయమేమిటంటే.. పీఎల్ నారాయణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగిందని, ఆ తర్వాత ఓ హీరోని పెళ్లి చేసుకుని సెటిలైందని మీకు తెలుసా.. అ అమ్మాయి ఎవరో కాదు.. అలనాటి తార . ఈమె పీఎల్ నారాయణకు స్వయానా మేనకోడలు. 1990లో కన్నడ చిత్రం ‘హృదయ సామ్రాజ్య’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన శివరంజని.. ఆ తర్వాత తమిళంలో సుమారు 20 సినిమాల్లో నటించి స్టార్ హోదా సొంతం చేసుకుంది. Also Read: 1994లో ‘ఆమె’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన శివరంజని పేరును దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘ఊహ’గా మార్చారు. ఆమె తెలుగులో హీరో శ్రీకాంత్‌తోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఊహ తెలుగులో తొలి, చివరి సినిమా శ్రీకాంత్‌తోనే చేయడం విశేషం. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు.


By November 24, 2020 at 09:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ooha-personal-life-shocking-secrets/articleshow/79381209.cms

No comments