ఆ ముచ్చట తీర్చినందుకే గౌతమ్‌ని పెళ్లాడా: కాజల్
హీరోయిన్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కొద్దిరోజుల క్రితం పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ కొత్త జంట అక్కడ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా తాను గౌతమ్‌ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని చెప్పింది కాజల్. Also Read: అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలబడి గులాబీ అందించి లవ్ ప్రపోజ్ చేయాలని కోరుకునే దాన్నని.. గౌతమ్ ఆ విధంగానే తన ప్రేమను వ్యక్తపరచడంతో కాదనలేకపోయానని కాజల్ చెప్పుకొచ్చింది. గౌతమ్... తనకు ప్రపోజ్ చేయడానికి ముందే తన పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడని, అయినప్పటికీ మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తాను కండిషన్ పెట్టినట్లు తెలిపింది. తనకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టమని.. అందుకే గౌతమ్‌తో లవ్ ప్రపోజ్ చేయించుకున్న తర్వాతే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పింది. తన ముచ్చట అలా తీర్చినందుకే గౌతమ్‌ని పెళ్లాడానని ఈ చందమామ చెప్పుకొచ్చింది. Also Read:
By November 24, 2020 at 08:52AM
No comments