Breaking News

మరికాసేపట్లో సీఎంలతో ప్రధాని మోదీ భేటీ


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. పరిస్థితిని సమీక్షించడం కోసం 8 రాష్ట్రాల సీఎంలతో నేడు భేటీ కానున్నారు. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 పరిస్థితి గురించి మోదీ సమీక్షించనున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పంపిణీ చేసే విషయాన్ని కూడా ప్రధాని చర్చిస్తారు. నేటి ఉదయం (మంగళవారం) 10.30 గంటలకు మీటింగ్ తొలి భాగంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో మోదీ సమావేశమవుతారు. రెండో భాగంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వ్యాక్సిన్ పంపిణీ విషయమై చర్చిస్తారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై నీతి ఆయోగ్ సహా దేశంలోని ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. వ్యాక్సినేషన్ స్ట్రాటజీని చర్చించారు. సోమవారం దేశంలో 44,059 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. ప్రస్తుతం మన దేశంలో 4.43 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.


By November 24, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-meet-review-covid-19-situation-with-chief-ministers-today/articleshow/79381058.cms

No comments