Breaking News

Ongole:సెల్‌ఫోన్ తెచ్చిన తంటా.! బాలికల పరారీ, పోలీసుల ఛేజ్.. చివరికి..


ఆన్‌లైన్‌ క్లాసులు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. చిన్నారులు సెల్‌ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. క్లాసులు అయిపోయిన తర్వాత కూడా ఫోన్‌లు చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతుండడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వారిని మందలిస్తే ఏం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అలా మందలించినందుకు నలుగురు బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయిన షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లాలోని పొదిలికి చెందిన టెన్త్‌ విద్యార్థిని ఆన్‌లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత కూడా ఫోన్ ఎక్కువగా చూస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆగ్రహం చెందిన బాలిక తన బంధువులైన మరో ముగ్గురు బాలికలను వెంటబెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం సమయంలో పొదిలి నుంచి దర్శి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అనంతరం అక్కడి నుంచి వినుకొండకు బస్సులో బయలుదేరారు. Also Read: ఈలోపు బాలికలు కనిపించకుండా పోయారంటూ వారి తల్లిదండ్రులు పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి సమాచారం అందించారు. నలుగురు బాలికల్లో ఒకరి వద్ద ఫోన్ ఉందని తెలుసుకుని ఆ ఫోన్ ప్రయాణిస్తున్న మార్గాన్ని అనుసరించారు. వారు వినుకొండలో ఉన్నట్లు సమాచారం రావడంతో కురిచేడు పోలీసులను అప్రమత్తం చేశారు. వినుకొండలో బస్సు దిగి కారంపూడి రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్న బాలికలను కురిచేడు ఎస్సై గుర్తించి వారిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. Read Also:


By November 14, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-girls-run-away-from-homes-police-track-down-in-prakasam-district-of-andhra-pradesh/articleshow/79219733.cms

No comments