Breaking News

విడాకులపై జోరుగా ప్రచారం: ట్రంప్‌నకు దూరంగా.. సైనికుడికి దగ్గరగా మెలానియా!


అమెరికా అధ్యక్షుడు , ఆయన భార్య మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చినా ఎవరి మంచి వారిదేనంటూ మెలానియా మాజీ సహాయకురాలు స్టెఫానీ వోకాఫ్‌ అన్నట్టు డెయిలీ మెయిల్ కథనం వెలువరించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పీఠం నుంచి ట్రంప్ దిగిపోయిన మరుక్షణమే ఆమె విడాకులు ఇచ్చేస్తారని, ఘడియలు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ రాజకీయ సహాయకురాలు ఒమరోసా మెనిగాట్‌‌ చెప్పినట్టు వివరించింది. Read Also: ఈ ప్రచారానికి బలం ఇచ్చేలా డొనాల్డ్‌, మెలానియాల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ట్రంప్ చేయిపట్టుకోకుండా పక్కనే ఉన్న ఓ సైనికుడి చేయి పట్టుకుని గొడుగు కింద మెలానియా నడవడం చర్చనీయాంశమయ్యింది. నవంబరు 11న సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర సైనికులకు నివాళులర్పించేందుకు ట్రంప్‌ దంపతులు అర్లింగ్టన్‌ శ్మశనానికి వెళ్లారు. Read Also: వాహనం దిగిన అనంతరం మెలానియా భౌతిక దూరం నిబంధన పాటించకుండా. ఒక సైనికుడి చేయి పట్టుకుని ట్రంప్‌నకు దూరంగా నడిచి వచ్చారు. ట్రంప్‌ దంపతులు మాస్కులు సైతం ధరించకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్యక్రమం పూర్తయినంత వరకూ మెలానియా ఆ సైనికుడి చేతినే పట్టుకుని నిల్చున్నారు. Read Also: ఈ కార్యక్రమంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా సైతం పాల్గొన్నారు. ఆమె కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించడం విశేషం. రెండో భార్య మార్లాతోనూ ట్రంప్‌ది ఒప్పంద వివాహం కావడం వల్ల మెలానియాతో రహస్య ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడడం లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దీనికి మరింత బలానిస్తున్నాయి.


By November 14, 2020 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/trump-divorce-rumours-melania-trump-photo-arm-in-arm-with-soldier-under-umbrella-goes-viral/articleshow/79219750.cms

No comments