Hyd: చేయని తప్పుకి బలైపోయిన తల్లీకొడుకులు.. రోడ్డు మీదకి రావడమే నేరమా.!
చేయని తప్పుకి తల్లీకొడుకులు బలైపోయిన విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది. అవతలి వైపు అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకొడుకులను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. రాచకొండ కమిషనరేట్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ జీవీఆర్ నగర్‌కి చెందిన సందీప్ రెడ్డి(19), అతని తల్లి చంద్రకళ(48) స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా కారు అతివేగంతో దూసుకొచ్చింది. సాగర్ రోడ్డులో హైద్రాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి వచ్చి స్కూటీని ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న శరత్ చంద్ర, ఇమ్మానుయేల్‌కి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో అత్యంత వేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 13, 2020 at 12:12PM
No comments