Breaking News

Guntur: ముఖంపై స్ప్రే చల్లి హోటల్ ఓనర్ హత్య.. వీడిన షాకింగ్ మర్డర్ మిస్టరీ


జిల్లాలో కలకలం రేపిన హోటల్ ఓనర్ మర్డర్ మిస్టరీ వీడింది. ముఖంపై స్ప్రే చల్లి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలంగా మారింది. స్ప్రే చేసి ఎలా హత్య చేశారన్నది చిక్కు వీడని ప్రశ్నగా మిగిలింది. ఎట్టకేలకు పెదకూరపాడు పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. భార్య తన ప్రియుడితో కలసి సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించినట్లు అనుమానిస్తున్నారు. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరులో హోటల్ నడుపుతున్న బ్రహ్మయ్య ఈ నెల 5న దారుణ హత్యకు గురయ్యాడు. హోటల్ వ్యర్థాలు ఊరిచివర పారబోసేందుకు వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బ్రహ్మయ్య ముఖం, కళ్లలో స్ప్రే చల్లి పారిపోయారు. ముఖంపై మంటలు రావడంతో తీవ్రగాయాలతో ఇంటికొచ్చిన బ్రహ్మయ్యని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. రసాయనాలు స్ప్రే చేసి హత్య చేసి ఉంటారని అనుమానించారు. స్ప్రే చల్లి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్‌డేటా ఆధారంగా విచారణ జరపడంతో కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలసి మచిలీపట్నంకి చెందిన వ్యక్తులకు సుపారీ ఇచ్చి బ్రహ్మయ్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సుపారీ గ్యాంగ్ సైనైడ్ ముఖంపై, కళ్లలో స్ప్రే చేయడంతో బ్రహ్మయ్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. Also Read:


By November 27, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/shocking-information-revealed-in-guntur-hotel-owner-murder-case/articleshow/79439801.cms

No comments