Breaking News

ప్రసవం కోసం పుట్టింటికొచ్చిన భార్య.. మాజీ ప్రియుడిపై మనసు మళ్లి.. దారుణం


ఐదేళ్లు ఒకరితో ప్రేమాయణం నడిపి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. గర్భం దాల్చిన తరువాత ప్రసవం కోసం పుట్టింటికొచ్చిన ఆమెకు ఎదురింట్లో ఉండే ప్రియుడిపై మనసు మళ్లింది. ఆమెను మర్చిపోలేకపోయిన ప్రియుడు కూడా జతకలిశాడు. ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీయగా భార్య వివాహేతర సంబంధం వెలుగులోకి రావడంతో బంధువులు కంగుతిన్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో జరిగింది. హుబ్లీ తాలూకా అంచటగెరికి చెందిన అక్షతకి హవేరి జిల్లా హానగల్‌కి చెందిన జగదీష్‌తో ఏడాదిన్నర కిందట వివాహమైంది. గర్భం దాల్చిన అక్షత ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఎదురింట్లో ఉండే మాజీ ప్రియుడిపై మనసు మళ్లింది. కేఈబీ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న కాశప్పతో ఐదేళ్లు ప్రేమాయణం నడిపిన అక్షత ఏడాదిన్నర కిందట జగదీష్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాశప్ప కూడా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన అక్షత మాజీ ప్రియుడికి మళ్లీ దగ్గరైంది. జగదీష్‌ను చంపేస్తే ఇద్దరూ మళ్లీ కలిసి ఉండొచ్చని భావించారు. భార్యాబిడ్డలను చూసేందుకు అంచటగెరికి వచ్చిన జగదీష్‌ని మందు పార్టీ చేసుకుందామంటూ భార్య ప్రియుడు కాశప్ప ఊరి శివారుకు తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత మత్తులో ఉన్న జగదీష్‌ తలపై బండరాయితో కొట్టి కిరాతకంగా చంపేశాడు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: భార్యపై అనుమానంతో ఆమె ఫోన్ కాల్‌ డేటాను పరిశీలించడంతో కాశప్పకి ఫోన్ చేసినట్లు తెలుసుకున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టడంతో కాశప్పతో వివాహేతర సంబంధం బయటపడింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజం కక్కేశాడు. పెళ్లికి ముందు నుంచే ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని.. భర్తను చంపేస్తే కలిసి ఉండొచ్చని ఘాతుకానికి తెగబడినట్లు ఒప్పుకోవడంతో ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Read Also:


By November 27, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-paramour-in-hubballi-of-karnataka/articleshow/79439232.cms

No comments