Guntur Doctors Brain Surgery: బిగ్‌బాస్ షో చూపిస్తూ మెదడుకు సర్జరీ.. గుంటూరు డాక్టర్ల అద్భుతం
బిగ్ బాస్ షోకి కోట్లు పెట్టి నిర్వహించినా దక్కని ప్రమోషనల్ మెటీరియల్ ఒకే ఒక్క బ్రెయిన్ ఆపరేషన్‌తో లభించింది. ఆపరేషన్ ఏంటి? బిగ్ బాస్ ఏంటి అంటే.. మనం ఒకసారి గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్ డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స గురించి తెలుసుకోవాల్సిందే. ఆ వివరాల్లోవెళితే.. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామానికి చెందిన యువ సాప్ట్‌వేర్ ఇంజనీర్ బత్తుల వరప్రసాద్ బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతనికే నాలుగేళ్ల క్రితం మెదడులో ట్యూమర్ ఏర్పడటంతో హైదరాబాద్‌లోని ప్రయివేట్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఆ తరువాత అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇటీవల వరప్రసాద్‌కి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో.. గుంటూరు నగరంలోని బ్రిందా న్యూరో సెంటర్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన సీరియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి.. వరప్రసాద్ మెదడులోని ఫంక్షనల్ ఏరియాలో 3 సెంటీమీటర్ల సైజులో కణిత ఉన్నట్లు యం.ఆర్.ఐ. పర్‌ఫ్యూజన్ స్కాన్ ద్వారా తెలుసుకున్నారు. అయితే శస్త్ర చికిత్స చేయడానికి ఆ కణితి భాగంలో మెడ, కాలు భాగానికి సప్లయిఅయ్యే నరాలు ఉండటంతో వర ప్రసాద్‌కి అవేక్ బ్రెయిన్ సర్జరీ నిర్వహించాల్సి ఉందని అరుదైన ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేశారు. ఈ క్లిష్టమైన జరిగినంతసేపు రోగి సహకరించాల్సి ఉంటుందని చేతులు వేళ్లు కదిలించాలని అందువల్ల మత్తు మందు ఇవ్వడం కుదరకపోవడంతో.. మెదడు ప్రాంతానికే మత్తు మందు ఇచ్చి మిగతా శరీరమంతా స్పృహలో ఉండేటట్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో అతనికి ఆపరేషన్ అంటే భయం పోగొట్టడానికి తననికి ఇష్టమైన నాగార్జున ‘బిగ్ బాస్ ’ షోని ఆపరేషన్ థియేటర్‌లో లాప్ ట్యాప్‌లో చూపించారు డాక్టర్లు. కొంతసేపు బిగ్ బాస్.. ఆ తరువాత అవతార్ సినిమాలు చూస్తూ డాక్టర్లకు సహకరించాడు వర ప్రసాద్. సుమారు గంటన్నర పాటు సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ డి.శేషాద్రి శేఖర్, బొమ్మిశెట్టి త్రినాథ్, శ్రీనివాసరెడ్డి వైద్య బృందం శ్రమించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేవని ప్రకటనలో తెలియజేశారు వైద్యులు. మొత్తానికి బిగ్ బాస్ షో చూస్తూ క్లిష్టమైన ఆపరేషన్‌కు సహకరించి ప్రాణాలను దక్కించుకున్నాడు గుంటూరు సాఫ్ట్ వేర్ వర ప్రసాద్.
By November 21, 2020 at 11:53AM
No comments