Breaking News

Cyclone Nivar: 144 సెక్షన్ అమలు.. నిత్యావసరాలు మినహా దుకాణాలన్నీ బంద్


తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫాన్‌గా మారుతున్న నివర్.. బుధవారం సాయంత్రం తమిళనాడులోని మామళ్లపురం- కరైకల్ మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తుపాన్ ముప్పును తగ్గించడం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. అనవసర జన సంచారం తగ్గించడం కోసం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు మినహా మరే ఇతర షాపులు, వాణిజ్య సముదాయాలేవీ తెరవకుండా ఆంక్షలు విధించింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం గంటల వరకు పుదుచ్చేరి వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ పుదుచ్చేరి జిల్లా మెజిస్ట్రేట్ పూర్వా గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల రాకపోకలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గార్గ్ తెలిపారు. సైక్లోన్ డ్యూటీలో ఉన్న ఏజెన్సీలు, అధికారులకు ఈ ఆదేశాలు వర్తించవు. తీవ్ర తుఫాన్‌గా నివర్ తీరాన్ని దాటనుండటంతో.. తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాల సాయం అందిస్తామని మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడులోని అరకోణం నుంచి ఎన్డీఆర్ బలగాలు మంగళవారం పుదుచ్చేరి చేరుకున్నాయి. తుఫాన్ అనంతరం సహాయక చర్యలు చేపట్టడం కోసం కరైకల్‌లో మరో బృందాన్ని మోహరించారు. పాఠశాలలన్నీ మూసివేయాలని ఆదేశించారు. సైక్లోన్ నివర్ కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ విభాగం ఏపీ, తెలంగాణల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


By November 24, 2020 at 02:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/to-prevent-danger-from-cyclone-nivar-puducherry-imposes-probationary-orders/articleshow/79386070.cms

No comments