కిడ్నీ వ్యాధితో పోరాడుతూ ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత


ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు, టీవీ ఆర్టిస్ట్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 55 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. మే నెల నుంచి కిడ్నీకి సంబంధించి ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారని తెలిపారు. ఆయన మృతి పట్ల సినీ వర్గాలు సంతాపం తెలుపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆశీష్ రాయ్ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. పలు మార్లు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు కానీ ఆర్ధిక సమస్యలతో మెరుగైన వైద్యం అందుకోలేకపోయారని సమాచారం. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెబుతూ ఆయన ఆవేదన చెందారు. Also Read: దాదాపు 23 ఏళ్ల పాటు కెమెరా ముందు కదులుతూ అలరించారు ఆశీష్ రాయ్. ''బనేగి అప్నీ బాత్, ససురాల్ సిమర్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసీ భీ'' లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆయన నటించారు. ''నేతాజీ సుభాష్ చంద్రబోస్, హోమ్ డెలివరీ, మేరా పహ్లా పహ్లా ప్యార్'' లాంటి హిందీ సినిమాల్లో కూడా నటించి వెండితెరపై తన మార్క్ వేసుకున్నారు.
By November 24, 2020 at 01:17PM
No comments