Breaking News

సమంత కొడుకు బర్త్ డే..! విషయాన్ని అందరి ముందుంచుతూ అక్కినేని కోడలి స్వీట్ మెసేజ్..


అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన విషయాలు, అక్కినేని ఫ్యామిలీ సంగతులు పంచుకుంటూ ఉండే సామ్.. తాజాగా 'హ్యాపీ బర్త్ డే మై బాయ్' అంటూ ఓ స్వీట్ మెసేజ్ పోస్ట్ చేసింది. అంతేకాదు తన కొడుకు అంటూ అతన్ని మరోసారి అందరికీ పరిచయం చేసింది. దీంతో సామ్ పోస్ట్ చేసిన ఆ పిక్, పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత కొడుకుకు అక్కినేని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సమంత పెంపుడు కుక్క పేరు 'యష్'. ఇప్పటికే ఈ యష్‌తో సామ్ ఎన్నో ఫోటోలు దిగి తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యష్ కనిపించిన ప్రతిసారి మై బాయ్ అంటూ స్వీట్‌గా ఆమె పిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు (నవంబర్ 24) యష్ రెండవ పుట్టినరోజు అని పేర్కొంటూ.. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే మై బాయ్' అని ట్యాగ్ చేసి ఇన్స్‌స్టా గ్రామ్ పోస్ట్ పెట్టింది సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తన భార్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. నిన్న (నవంబర్ 23) నాగ చైతన్య 34వ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట మాల్దీవ్స్‌ వెళ్లింది. అక్కడి ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అక్కినేని అభిమానులకు కిక్కిస్తోంది సామ్. మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్న ఈ జోడీ అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు సామ్ పోస్ట్ చేస్తున్న ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. Also Read: ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతూనే టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది. వెబ్ సిరీస్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై తన మార్క్ చూపించేలా అడుగులేస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో పోషిస్తున్న సమంత.. ఆహా వేదికపై ప్రసారమవుతున్న 'సామ్ జామ్' ప్రోగ్రాంని హోస్ట్ చేస్తోంది.


By November 24, 2020 at 02:44PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-posted-her-boy-pic-and-comment-as-happy-birth-day-my-boy/articleshow/79386474.cms

No comments