బెస్ట్ విషెస్ నామినేటెడ్ సీఎం గారూ.. ప్రతిపక్ష నేత వ్యంగ్యాస్త్రాలు
బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ దూరంగా ఉంది. అయితే, నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ యువనేత .. మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విషయంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్‌తో స్వరం కలిపారు. నామినేటెడ్ సీఎం అంటూ నితీశ్ కుమార్‌ను తేజస్వీ అభివర్ణించారు. ఆయన పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా బీజేపీ దాయాదక్షిణ్యాలతోనే సీఎం అయ్యారు అని ఎద్దేవా చేశారు. ‘నామినేటెడ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు బెస్ట్ విషెస్ గౌరవనీయులైన నితీశ్ కుమార్ గారు..మీ ఆశయాలను కొనసాగించడానికి బదులు.. ప్రజల ఆకాంక్షలను, 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని, ఉపాధి, ఆరోగ్యం, ఆదాయ ఉత్పత్తి, నీటిపారుదలకు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. బిహార్ ఎన్నికల్లో 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్‌డీఏ కూటమి మెజార్టీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ తేజస్వీ విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనా సంక్షోభం, బిహార్ అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలను ప్రచారం ప్రస్తావిస్తూ నితీశ్‌ను ఇరుకునబెట్టారు. తాము అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్‌లోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం కావడం ఇది వరుసగా నాలుగోసారి. 20 ఏళ్లలో సీఎం పదవిని అలంకరించడం నితీశ్‌కు ఇది ఏడోసారి. మంత్రులుగా మరో 14 మంది ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీకి చెందిన తారాకిశోర్ ప్రసాద్, రేణూ దేవి డిప్యూటీ సీఎంలుగా.. బీజేపీ నుంచి మరో ఐదుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్డీయేలో ఇతర భాగస్వామ్యపక్షాలైన హెచ్‌ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులయ్యారు.
By November 17, 2020 at 10:55AM
No comments