పెంపుడు కుక్కల ద్వారా కరోనా వ్యాప్తి..? అధ్యయనంలో విస్తుగొలిపే వాస్తవాలు
మీరు కుక్కను పెంచుకుంటున్నారా..? రోజూ మీ పెంపుడు శునకాన్ని బయటకు తీసుకెళ్లే అలవాటు మీకుందా..? అయితే జాగ్రత్త.. ఇతరులతో పోలిస్తే మీరు కరోనా బారిన పడే ముప్పు ఎక్కువట. కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే వారికి కరోనా సోకే అవకాశాలు 78 శాతం ఎక్కువని స్పానిష్ పరిశోధకులు తేల్చారు. కోవిడ్ సోకిన శునకాల ద్వారా వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని.. లేదా బయటకు వెళ్లిన సమయంలో శునకాలు కలుషిత ఉపరితాలను తాకడం ద్వారా వైరస్‌ను వ్యాప్తి చెందించే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనే విషయమై పూర్తిగా అవహగాన లేకపోయిన్పటికీ.. కుక్కలు, పిల్లులు కరోనా బారిన పడతాయని తేలింది. ఇతర జంతువుల నుంచి గబ్బిళాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని కూడా తేలింది. కానీ జంతువులు అనారోగ్యం బారిన పడినట్లు కనిపించవు. శునకాల యజమానులు వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు.. ఇంటికి తీసుకొచ్చాక పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ గ్రనడా, అండాలూసియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ అధ్యయనం చేపట్టాయి. స్పెయిన్‌లోని 2086 మంది పరిశోధకులు సర్వే చేపట్టారు. వీరిలో 41 శాతం మంది 40-54 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కంటే.. హోం డెలివరీ పొందే వారిలోనే 94 శాతం కరోనా సోకే రిస్క్ ఎక్కువని తేలింది. ఇంట్లో నుంచి పని చేయడానికి బదులు ఆఫీసుకు వెళ్లేవారు కోవిడ్ బారిన పడే ముప్పు 76 శాతం అధికమని రుజువైంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఇతరులకు కూడా సోకే ముప్పు 60 శాతం పెరుగుతుందని తేలింది.
By November 17, 2020 at 10:42AM
No comments