Breaking News

అధ్యక్షుడికి ఎంతో ఇష్టమైన శునకానికి బంగారు విగ్రహం.. రాజధాని నడిబొడ్డున ఏర్పాటు!


ప్రజల కోసం, దేశం కోసం తమ జీవితాలను దారబోసిన గొప్ప వ్యక్తులు, మహాత్ముల విగ్రహాలను ఏర్పాటుచేయడం సర్వసాధారణం. అంతేకాదు, తాము అభిమానించే వ్యక్తులు దూరమైనా ఎడబాటు తట్టుకోలేక వారికి విగ్రహాలను కట్టించడం గురించి విన్నాం. అయితే, ఓ దేశాధినేత తనకు ఎంతో ఇష్టమైన శునకానికి బంగారంతో విగ్రహం చేయించి, రాజధాని నడిబొడ్డున నెలకొల్పాడు. తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు బంగారంతో 19 అడుగుల ఎత్తైన శునకం విగ్రహం తయారుచేయించి, రాజధాని యష్గబత్‌లో ఆవిష్కరించారు. అక్కడ ఎక్కువగా కనిపించే అలబాయ్ జాతికి చెందిన ఈ శునకాలను సెంట్రల్‌ ఆసియా షెపర్డ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ జాతి శునకాలంటే గర్భాంగులీకి చాలా ఇష్టం. వాటిపై ఏకంగా ఒక పుస్తకాన్ని రాశారు. అలాగే, 2017లో అలబాయ్ కుక్కపిల్లను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయన పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. అందుకే వాటి గౌరవార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతేకాదు, ఈ భారీ స్మారక చిహ్నంలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తాయని తెలిపింది. రాజధాని యాష్గబత్‌లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. భారీ భవంతులు, షాపింగ్‌మాల్స్‌ నిర్మాణం సాగుతోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే అక్కడి ప్రధాన కూడలి వద్ద బంగారు శునక విగ్రహం ఏర్పాటైంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్కాడాగ్ లేదా మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్ రక్షకుడుగా గుర్తింపు పొందిన బెర్డిముఖమదోవ్.. అలబాయ్ శునకం లేదా మధ్య ఆసియా షెపర్డ్‌ను జాతీయ వారసత్వంగా అభివర్ణించారు. మధ్య ఆసియా సంతతికి చెందిన ఈ శునకాలు.. గొర్రెలు, మేకలను కాపలాలో పరాక్రమానికి ప్రసిద్ది చెందాయి. కుక్కల పోరాటాలు తుర్క్‌మెనిస్థాన్‌లో ప్రధాన వినోదం.


By November 20, 2020 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/turkmenistan-president-unveils-19-foot-gold-coated-sculpture-of-his-favourite-dog-breed/articleshow/79317486.cms

No comments