భార్య చనిపోయిందనుకుని కాల్వలో పడేసిన భర్త.. కానీ కొనఊపిరితో.! కర్నూలులో దారుణం
భార్య మరొకరితో వివాహేతరం సంబంధం పెట్టుకుందన్న కోపంతో కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. ఆమె చనిపోయిందనుకుని తీసుకెళ్లి కాల్వలో పడేశారు. అక్రమ సంబంధం వ్యవహారమై మందలించినందుకు తన కూతురు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుందంటూ కన్నతల్లే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అంతా ఆత్మహత్య అనుకున్నారు. అయితే ఆమె కొనఊపిరితో బయటపడడంతో కథ అడ్డం తిరిగింది. ఆమె తలపై గాయాలు ఉండడం అనుమానాలు రేపింది. చివరికి నిందితులు తమ నేరం ఒప్పుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి, ప్రభావతి దంపతులు(38). కొద్దికాలంగా ప్రభావతి మరొకరితో పెట్టుకుంది. ఆ విషయం భర్తకి తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. ప్రభావతి తల్లి వెంకటేశ్వరమ్మ, తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డికి విషయం చెప్పాడు. ముగ్గురూ కలసి ఆమెను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దెబ్బలకు ఆమె చనిపోయిందని భావించి కారులో తీసుకెళ్లి పెద్దకడబూరు మండలం హెచ్.మురవాణి వద్ద ఎల్‌ఎల్‌సీ కాలువలో పడేశారు. కాల్వలో మహిళ కొట్టుకురావడంతో చుట్టుపక్కల రైతులు గుర్తించి ఆమెను కాల్వలో నుంచి బయటికి తీశారు. కొనఊపిరితో కొట్టుకుంటున్న ప్రభావతి కొద్దిసేపటికే మరణించింది. అయితే వివాహేతర సంబంధం విషయమై మందలించినందుకు తన కూతురు కాల్వలో దూకి ప్రాణాలు తీసుకుందంటూ తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆత్మహత్యగా భావించారు. Also Read: కానీ.. మృతురాల ప్రభావతి తలపై తీవ్రగాయాలు ఉండడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ దిశగా విచారణ చేపట్టడంతో కుటుంబ సభ్యులే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తేలింది. ఎప్పటికైనా దొరికిపోతామన్న భయంతో నిందితులు కూడా స్థానిక వీఆర్వో వద్ద నేరం ఒప్పుకుని లొంగిపోవడంతో ఆయన వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:
By November 20, 2020 at 12:05PM
No comments