Breaking News

Nagarkurnool: బిడ్డలతో సహా చెరువులో దూకేసిన తల్లి.. తీవ్ర విషాదం


కుటుంబ కలహాలు ముగ్గురు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారులను సైతం చిదిమేసింది. జీవితంపై విరక్తి చెందిన తల్లి పిల్లలతో సహా చెరువులో దూకి చేసుకుంది. ఈ అత్యంత విషాదకర ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన అమృత(30)కి తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన రాజుతో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్లు గాయత్రి(3) ఆరునెలల సంతోషి సంతానం. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య అమృత నాలుగు నెలల కిందట పుట్టింటికి చేరింది. ఏమైందో తెలియదు అనూహ్యంగా తన ఇద్దరు పిల్లలతో కలసి గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. తన ఇద్దరు కూతుళ్లను కూడా ఈ లోకం నుంచి తీసుకెళ్లింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 20, 2020 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-commits-suicide-along-with-her-daughters-in-nagarkurnool/articleshow/79317876.cms

No comments