ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే భార్య, కూతురిపై కన్ను.. హైదరాబాద్‌లో దారుణం
తాగుబోతుల ఫ్రెండ్‌షిప్ దారుణానికి దారితీసింది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన యువకుడితో బార్‌లో స్నేహం కుదిరింది. అది ఇంటికి తీసుకెళ్లే వరకూ వెళ్లింది. స్నేహితుడు కదా అని ఇంటికి రానిస్తే కీచకుడు నీచానికి పాల్పడ్డాడు. ఫ్రెండ్ భార్య, కూతురిపై కన్నేశాడు. ఆ విషయం ఏకంగా అతనికే చెప్పడంతో ఆగ్రహం చెందిన స్నేహితుడు యువకుడిని దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఆనంఖాన్(31) హైదరాబాద్‌కి వలసొచ్చి చాంద్రాయణగుట్టలో నివాసముంటున్నాడు. మద్యం తాగేందుకు ఆనంఖాన్ తరచూ స్థానికంగా ఉన్న ఓ బార్‌కి వెళ్లే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన హమీద్(పేరుమార్చాం)తో స్నేహం ఏర్పడింది. కొద్దికాలంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఆనంఖాన్‌ని హమీద్ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. స్నేహితుడు కదా అని ఇంటికి రానిస్తే ఆనంఖాన్ నీచానికి దిగాడు. ఫ్రెండ్ భార్య, కూతురిపై కన్నేశాడు. వారితో పెట్టుకోవాలనుకున్నాడు. ఆ విషయం నేరుగా అతని స్నేహితుడికే చెప్పేశాడు. నీ భార్య, కూతురు అందంగా ఉంటారని.. తనతో చనువుగా ఉండేలా చూడాలంటూ నీచమైన కోరిక బయటపెట్టాడు. మద్యం మత్తులో అడిగాడని పెద్దగా పట్టించుకోలేదు. బార్‌లో మద్యం తాగుతుండగా మరోమారు అదే విషయం అడగడంతో హమీద్ సరేనంటూ ఆనంఖాన్‌ని తన బస్తీకి తీసుకెళ్లాడు. Also Read: మటన్ షాపు వద్దకు వెళ్లాక కత్తి తీసుకని ఆనంఖాన్‌ని విచక్షణా రహితంగా నరికేశాడు. ఇంటికి రానిస్తే నా భార్య, కూతురినే అడుగుతావా అంటూ ఆగ్రహంతో పొడిచేశాడు. స్థానికులు ఆనంఖాన్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By November 21, 2020 at 10:03AM
No comments