Breaking News

నిహారిక బ్యాడ్‌లక్... ఆ హిట్ సినిమాలో ఛాన్స్ వదులుకున్న మెగా డాటర్


మెగా బ్రదర్ కూతురు తొలినాళ్లలో చాలా వెబ్‌సిరీస్‌ల్లో నటించి ఆపై యాంకర్‌గానూ సత్తా చాటింది. ఆ తర్వాత నాగశౌర్య సరసన ‘ఒక మనసు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయినా నిహారికకు మాత్రం నటిగా మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో నిహారిక సినిమాలను దూరం పెట్టి వెబ్‌ సిరీస్‌ల బాట పట్టింది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ కనిపించినా అంత ప్రాముఖత ఉన్న పాత్ర కాదు. Also Read: మూడు సినిమాల్లో నటించినా హిట్ కొట్టలేకపోయిన నిహారిక చేజేతులా ఓ మంచి హిట్ సినిమాను వదులుకుందన్న విషయం చాలామందికి తెలియదు. ఇటీవల ఆహా యాప్ ద్వారా విడుదలై సంచలన విజయం సాధించిన ‘’లో హీరోయిన్ పాత్రకు మొదట నిహారికనే సంప్రదించిందట యూనిట్. కానీ కరోనా టైమ్‌లో రిస్క్ చేయడం ఎందుకని భావించి ఆమె ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దీంతో యూనిట్ చాందిని చౌదరిని తీసుకున్నారట. ఆ సినిమా విజయం సాధించడంతో పాటు హీరోయిన్ చాందిని చౌదరి, హీరో సుహాస్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాత్ర నిహారిక చేస్తే ఆమెకు మంచి పేరు రావడంతో పాటు కెరీర్లో ఓ హిట్ పడేది. అయితే తానే చేజేతులా మంచి ఆఫర్‌ వదులుకున్నానని నిహారిక ఇప్పుడు బాధపడుతోందట. ప్రస్తుతానికి కెరీర్ సంగతి పక్కన పెట్టేసిన ఈ మెగా డాటర్ డిసెంబర్‌లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకోబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ వీరి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.


By November 21, 2020 at 09:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/niharika-was-abandoned-heroine-chance-in-color-photo-movie/articleshow/79334596.cms

No comments