Breaking News

పగలు అడవిలో, రాత్రి ఇంట్లో.. ఖాకీల ఎంట్రీతో షాకింగ్


ఓ వ్యక్తి పగలు అడవిలో ఉంటూ రాత్రి వేళ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. పోలీసుల భయంతో అతనిలా చేస్తున్నాడని అనుమానం రావడంతో ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో షాకింగ్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో చేతులు, కాళ్లు కట్టేసి.. మర్మాంగాన్ని కోసేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన అమానుష ఘటన బటయపడింది. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకి చెందిన దొంతరవేణి బాలయ్య(34)కి తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. ఒక బాబు పుట్టాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న బాలయ్య రెండేళ్ల క్రితం విడిపోయి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నిస్సహాయ స్థితిలో రత్నగిరిపల్లె వచ్చాడు. నీరసంగా సొమ్మసిల్లి పడిపోయేలా ఉండడంతో స్థానికులు భోజనం పెట్టారు. అతను బాలయ్య ఇంటి సమీపంలోని ఇసుక దిబ్బపై పడుకున్నాడు. అది గమనించిన బాలయ్య గతంలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అతనే అని భావించి దారుణానికి ఒడిగట్టాడు. నమ్మకంగా అతన్ని గంభీరావుపేట మండలం గజసింగారం అటవీప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతని బట్టలు విప్పేసి చేతులు, కాళ్లు కట్టిపడేశాడు. బ్లేడుతో గొంతుకోశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు అతని మర్మాంగాన్ని సైతం కోసేసి బండరాయి తలపై వేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. Also Read: అప్పటి నుంచి బాలయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. పోలీసులు పట్టుకుంటారనే భయంతో పగలు అటవీ ప్రాంతంలో దాక్కుంటూ.. రాత్రివేళ మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడు బాలయ్యని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. Read Also:


By November 07, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-with-suspect-of-having-illicit-affair-in-sircilla/articleshow/79094321.cms

No comments