కరోనా కొత్త రూపు: మింక్‌ల నుంచి వ్యాప్తి.. అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయకపోవచ్చు?

కరోనా వైరస్ మహమ్మారి జన్యుమార్పిడితో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మార్పుల కారణంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Read Also: దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం ఉత్తర జూట్‌ల్యాండ్‌లో కొత్తగా ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్దీ ఫారమ్‌ల్లో మింక్‌లను పెంపకం చేపట్టారు. ఉత్తర డెన్మార్క్‌లో కోవిడ్-19 ఆంక్షలు నవంబరు 7 నుంచి అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ ప్రకటించారు. జన్యుమార్పడి ద్వారా మింక్ నుంచి వ్యాపించే వైరస్‌తో ప్రపంచం తీవ్ర ముప్పును ఎదుర్కోనుందని అన్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లకు ఈ రకం వైరస్ ముప్పుగా పరిణమించవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. Read Also: ఈ ప్రాంత ప్రజలు ప్రయాణాలను రద్దుచేసుకోవాలని ప్రధాని సూచించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఉత్తర జూట్‌ల్యాండ్ ప్రజలు వైరస్ వ్యాపించకుండా శతవిధాల కృషిచేయాలని, ప్రపంచం మనల్ని గమనిస్తోంది’ అని ప్రధాని ఫెడ్రెక్సన్ పిలుపునిచ్చారు. Read Also: స్థానిక మీడియా కథనం ప్రకారం.. 207 మింక్ ఫారమ్స్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. మొదట్లో దీనిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలోని దాదాపు 1,100 ఫారమ్స్‌లో సుమారు 1.7కోట్ల మింక్‌లకు వైరస్ ముప్పు ఏర్పడింది. తాజాగా ఐదు మింక్ కేంద్రాల్లోని 12 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. జూన్ నుంచి ఇప్పటి వరకు 214 మందికి వైరస్ సోకినట్లు ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ నివేదికలో పేర్కొంది. Read Also: ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. దాదాపు ఐదున్నర నెలలుగా ఈ వ్యాధి ఆనుపానులు కనిపించినా నిర్లక్ష్యం చేశారని హజ్రింగ్ మేయర్ డాక్టర్ ఆర్నె బోయెల్ట్ తెలిపారు. ఉత్తర డెన్మార్క్‌లోని 783 కేసుల్లో సగం మింక్ నుంచి వ్యాపించినవేనని డెన్మార్ ఆరోగ్య మంత్రి మాగ్నస్ హ్యూనిక్కే అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మింక్ చర్మాలను ఎగుమతి చేసే దేశాల్లో డెన్మార్క్ ఒకటి. ఏటా 17 మిలియన్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో ఇది 40 శాతం. మరోవైపు, డెన్మార్క్‌లో మొత్తం 52,265 మంది ఇప్పటి వరకు వైరస్ బారినపడ్డారు. వీరిలో 733 మంది ప్రాణాలను కోల్పోయారు.
By November 07, 2020 at 09:56AM
No comments