Breaking News

ప్రియురాలు, స్నేహితులే కొట్టి చంపారు.. అనంతపురంలో దారుణం


అనంతపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తిని అతని ప్రియురాలు, స్నేహితులే కిరాతకంగా కొట్టి చంపిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన కట్టా కన్నాచారి హత్య కేసు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కన్నాచారి, పెనుకొండ పట్టణానికి చెందిన రోజా, జనశక్తి నగర్‌కి చెందిన దూదేకుల బాబయ్య, దూదేకుల మస్తాన్, దూదేకుల నూర్‌ మహ్మద్, మొదటి రోడ్డుకి చెందిన సాకే గుణ స్నేహితులు. కన్నాచారి రోజాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కన్నాచారి భార్య అని చెప్పుకుంటూ సహజీవనం చేస్తోంది. రోజూ అందరూ కలిసి మద్యం తాగి వారిలో వారే గొడవపడేవారు. ఈ నెల ఒకటో తేదీన ఆర్‌ఎం కార్యాలయ ఆవరణలో అందరూ మద్యం తాగుతుండగా డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహం చెందిన స్నేహితులు కన్నాచారిని కంకరరాయి, రేపర్ కర్రలతో విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కన్నాచారి మృతి చెందడంతో అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: ఆర్‌ఎం కార్యాలయ ఆవరణలో హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ప్రియురాలు, స్నేహితులే కొట్టి చంపారని విచారణలో తేలడంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. Read Also:


By November 04, 2020 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-killed-by-his-paramour-and-friends-in-anantapur/articleshow/79034133.cms

No comments