Breaking News

Jeevitha: రాజశేఖర్‌ కోలుకుంటున్నారు.. త్వరలోనే గుడ్‌న్యూస్ వింటారు: జీవిత


కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిందని వెల్లడించారు. ఆయన శరీరం వైద్యానికి సహకరించడం వల్ల వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. డాక్టర్లు అనుక్షణం ఆయన్ని కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోందని జీవిత తెలిపారు. మొదట రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లడంతో తాము, డాక్టర్లు చాలా ఆందోళన పడ్డామని జీవిత తెలిపారు. అయితే రాజశేఖర్ వెంటిలేటర్‌పై ఉన్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇన్ని రోజుల చికిత్సలో ఆయన ఒక్కరోజు కూడా వెంటిలేటర్‌పై లేరని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అభిమానులు, సన్నిహితులందరికీ జీవిత ధన్యవాదాలు తెలిపారు. Also Read:


By November 04, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jeevitha-clarity-about-hero-rajasekhar-health-condition/articleshow/79033833.cms

No comments