Breaking News

తిప్పి పంపిన కథతో సూపర్ హిట్ కొట్టిన ఈవీవీ.. ‘జంబలకిడి పంబ’ తెరవెనుక కథ


తెలుగు సినీ ప్రేక్షకులు కామెడీ అంటే పడిచస్తారు. అందుకే ఏ పరిశ్రమలోనూ లేనంత మంది కమెడియన్లను టాలీవుడ్‌ ఆదరించింది. కొందరు దర్శకులైతే కామెడీ చిత్రాలతో బాగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో పేరు టాప్‌లో ఉంటుంది. సుప్రసిద్ధ దర్శకుడు జంధ్యాల శిష్యుడిగా అనేక సినిమాలకు పనిచేసిన ఈవీవీ.. 1990లో వచ్చి ‘చెవిలో పువ్వు’ సినిమాతో దర్శకుడిగా మారారు. సుమారు 51 సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో సింహ భాగం కామెడీ చిత్రాలే. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘జంబ లకిడి పంబ’ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పత్రికలో ప్రచురణ కోసం ఈవీవీ ఆ కథను రాసి పంపగా.. ఇదికూడా ఓ కథేనా అని వాళ్లు తిప్పి పంపించారట. అసలు ఆ సినిమా తెర వెనుక ఉన్న కథను తెలుసుకుందాం.. జంధ్యాల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఈవీవీ సత్యనారాయణ పనిచేస్తున్న రోజులివి. ఆడది మగాడిగా.. మగాడు ఆడదానిగా మారితే ఎలా ఉంటుందన్న లైన్‌తో ఓ స్టోరీ రాసిన ఆయన ప్రచురణ కోసం ఆంధ్రజ్యోతి పత్రికకు పంపించారు. దాన్ని చదివిన పత్రిక వాళ్లు ఇది కూడా ఓ కథేనా అంటూ తిప్పి పంపించారట. దీంతో ఆయన తన గురువు జంధ్యాలకు ఆ కథను వినిపిస్తే.. బాగానే ఉంది కానీ సినిమాగా తీస్తే ఆడుతుందా? లేదా? అన్నది చెప్పలేం అని అన్నారట. దీంతో ఈవీవీ మరింత మసాలా జోడించి కథను రెడీ చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత డీవీవీ దానయ్య(ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్)ను కలిసి కథ వినిపించగా ఆయన సహ నిర్మాతగా ఉంటానని హామీ ఇచ్చారట. ఈ కథను రాసుకునేటప్పుడే హీరోగా రాజేంద్రప్రసాద్‌ను ఊహించుకున్నారంట ఈవీవీ. అయితే ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో నరేష్‌ను సంప్రదించారు. కథ బాగా నచ్చడంతో నరేష్ వెంటనే ఒప్పుకున్నారు. హీరోయిన్‌గా చాలామందిని సంప్రదించినా ఒప్పుకోలేదు. దీంతో తమిళంలో రెండు సినిమాలు చేసిన మీనాక్షి అనే అమ్మాయిని తీసుకున్నారు. ఆమె పేరును ఆమనిగా మార్చి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కేవలం రూ.50లక్షల బడ్జెట్‌తో నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేసేశారు. ఈ చిత్రానికి తొలుత ‘రివర్స్ గేర్’ అనే టైటిల్ పెట్టారు. అయితే నిర్మాతకు, దర్శకుడిగా ఈవీవీకి ఇదే తొలి సినిమా కావడంతో ఆ టైటిల్‌ను నెగిటివ్ భావించి.. చివరికి ‘జంబలకిడి పంబ’గా ఫిక్స్ చేశారు. 1992లో విడుదలైన ఈ సినిమా తొలిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు లేక తొలిరోజే చాలా బాక్సులు తిరిగొచ్చేశాయి. ఈ షాక్‌ నుంచి తేరుకున్న ఈవీవీ సత్యనారాయణ 1993లో నాగార్జునతో వారసుడు సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు. దీంతో ఈవీవీకి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది. Also Read: ఈ క్రేజ్‌తో ‘జంబలకిడి పంబ’ 1993 జులై 12వ తేదీ సెకండ్ రిలీజ్ చేశారు. ఇలాంటి సినిమాను మిస్ చేసుకున్నామా అని ఫీలైన ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. రూ.50లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.2కోట్ల రాబట్టింది. విజయవాడ, కాకినాడల్లో 100 రోజులు ఆడింది. ముఖ్యంగా స్కూల్‌ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా వచ్చి 28ఏళ్లయినా ఇంకా నవ్వులు పూయిస్తూనే ఉంది.


By November 13, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/evv-satyanarayana-directed-jamba-lakidi-pamba-movie-unknown-facts/articleshow/79204646.cms

No comments