Breaking News

వ్యాక్సిన్ వచ్చే వరకు వేవ్స్... కరోనాతో అత్యంత జాగ్రత్త


దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 84 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఉధృతి కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో రోజుకు ఆరు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీసీఎంబీ హెచ్చరిస్తోంది. సెకండ్ వేవ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. టీకా వచ్చే వరకు వేవ్ లు వస్తూనే ఉంటాయని సీసీఎంబీ పేర్కొన్నది. ఇండియాలో టీకా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అందుబాటులోకి రానున్నది. అప్పటి వరకు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. జనంలో భయం తగ్గిందని... వైరస్ బలహీనం అయ్యిందని ప్రజలు అపోహలతో బయట ఎలాంటి జాగ్రత్తలు లేకుండా యధేచ్చగా తిరిగేస్తున్నారు. మాస్కులు, వ్యక్తిగత దూరం మామూలుగా తిరిగేస్తున్నారు. అయితే మానవ తప్పిదంతోనే దేశంలో రెండోదశ కరోనా ప్రమాదకరంగా మారుతోందంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా. కరోనా రెండో దశ వ్యాప్తిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. Read More: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే వరకు వేవ్స్ ఉంటాయన్నారు. ఒకవేళ రెండోదశ మొదలైతే కట్టడి చేయడం కష్టం అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి రావొచ్చంటున్నారు. కాబట్టి జనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. టీకా రావడానికి చాలా సమయం పట్టొచ్చని మిశ్రా పేర్కొన్నారు. అందులోనూ దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాకు టీకా అందించాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఆ లోపు ఇంకా చాలా వేవ్స్‌ వస్తూనే ఉంటాయన్నారు.


By November 06, 2020 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-need-careful-about-corona-second-wave-ccmb-warning-on-virus/articleshow/79073484.cms

No comments