మంటల్లో కాలిపోయిన అక్క.. చెల్లిని పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్

చంటిబిడ్డతో సహా మహిళ మంటల్లో కాలి బూడిదైపోయింది. అనారోగ్య సమస్యలతో ఆత్మాహుతి చేసుకుందని అంతా భావించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ కేసు కూడా మూసేశారు. తీరా మంటల్లో కాలిపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఊహించని షాకిచ్చారు. ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని ధ్రువీకరించడంతో కథ అడ్డం తిరిగింది. గుట్టుచప్పుడు కాకుండా అక్కని, ఆమె కూతురిని చంపేసి మంటల్లో కాల్చేసిన చెల్లెలి కిరాతకం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కళ్లకురిచ్చికి చెందిన చిన్నస్వామికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె సుమతిని అదే ప్రాంతానికి చెందిన సమీప బంధువు రాజాకి ఇచ్చి వివాహం జరిపించాడు. వారికి ఒక పాప పుట్టింది. కొద్దికాలంగా సుమతి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చిన్నస్వామి ఆమెని కనిపెట్టుకుని ఉండేవాడు. ఆమెకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. గతవారం సుమతి, ఆమె కూతురు శ్రీనిధి అనూహ్యంగా మంటల్లో కాలిబూడిదయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగానే సుమతి కూతురితో సహా ఆత్మహత్య చేసుకుందని అంతా భావించారు. పోలీసులు కూడా అదే నిర్ధారణకు వచ్చారు. అయితే మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమతి, ఆమె కూతురి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో ఖాకీలు రంగంలోకి దిగారు. సుమతి చెల్లెలు సుజాతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో దారుణం బట్టబయలైంది. చిన్నస్వామికి గ్రామంలో 20 సెంట్ల స్థలం ఉంది. అక్క ఆరోగ్యం బాగోకపోవడంతో తండ్రి ఆమెకే ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఈ క్రమంలో తనకేమీ లేకుండా ఆ 20 సెంట్ల భూమి కూడా అమ్మేస్తాడేమోనని సుజాతలో అనుమానం మొదలైంది. Also Read: అక్కను చంపేస్తే భూమి మిగులుతుందని భావించి చెల్లెలు దారుణానికి ఒడిగట్టింది. పుట్టింటికి వచ్చిన అక్క సుమతి, ఆమె కూతురు శ్రీనిధి నిద్రిస్తున్న సమయంలో కత్తితో నరికి చంపేసింది. అనంతరం వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. ఆరోగ్య సమస్యల కారణంగానే తన అక్క ఆత్మాహుతి చేసుకుందంటూ మొసలి కన్నీరు కార్చింది. పోస్టుమార్టం రిపోర్ట్‌తో చెల్లెలి నాటకానికి తెరపడింది. Read Also:
By November 06, 2020 at 11:13AM
No comments