Breaking News

ఆ సినిమా ఓ పీడకల.. రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా: పూజా హెగ్డే


బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్‌గా పేరుపొంది స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఒక్కసారైనా నటించాలని హీరోయిన్లు ఆశపడుతుంటారు. అలాంటి ఛాన్స్ తొలి సినిమాకే దక్కించుకుంది బుట్టబొమ్మ . అశుతోష్ గోవారికర్ లాంటి స్టార్ డైరెక్టర్‌గా హృతిక్‌ హీరోగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మొహంజదారో’లో నటించింది పూజా. అప్పటికి దక్షిణాది ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే నటించిన ఆమె ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. Also Read: హృతిక్‌తో నటించడం వల్ల తన దశ తిరిగిపోతుందని పూజ ఆశలపై ఆ సినిమా నీళ్లు చల్లింది. హృతిక్‌ రోషన్ కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలవడంతో పూజాను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ఇతర దర్శక నిర్మాతలెవరూ సాహసించలేకపోయారు. దీంతో ఆ సినిమా ఆమె కెరీర్లో ఓ పీడకలగా మిగిలిపోయింది. ‘మొహంజదారో’ కోసం ఏకంగా రెండేళ్లు టైమ్ కేటాయించానని, తీరా చూస్తే డిజాస్టర్‌గా నిలిచిందని పూజా ఆవేదన చెందుతోంది. ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా తాలూకు అనుభవాలను పంచుకుందీ బుట్టబొమ్మ. ఎవరికైనా తొలి సినిమా చాలా కీలకమని, ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగుపెడితే మరిచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పూజా హెగ్డే తెలిపింది. హిందీలో తొలి సినిమా, అదీ తన ఫేవరెట్ హీరో సరసన అవకాశం కావడంతో ‘మొహంజదారో’లో నటించేందుకు ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నానని, కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడం తనను తీవ్రంగా భాధించిందని చెప్పుకొచ్చింది. ఆ బాధ నుంచి తెలుగు సినిమాలే తనను త్వరగా బయటపడేశాయని, ఇక్కడ వరుసగా సక్సెస్‌లు అందుకోవడంతోనే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. Also Read: బాలీవుడ్‌లో మొదటి సినిమా ఫ్లాప్ కావడంతోనే రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నానని పూజా వెల్లడించింది. రెండో సినిమా ‘హౌస్‌ ఫుల్ 4’ హిట్‌ కావడంతో ఇకపై బాలీవుడ్‌పైనా ఫోకస్ పెడతానని తెలిపింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజాకు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు ఆమె కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. Also Read:


By November 04, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-pooja-hegde-was-really-disappointed-after-mohenjo-daro-flop/articleshow/79035504.cms

No comments