Breaking News

తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఫలితాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. తొలుత డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌‌ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్‌ క్రమంగా పుంజుకొన్నారు. కీలకమైన స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్‌ ‌ఆధ్యిక్యంలో ఉన్నట్లు చూపించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ ఇప్పటి వరకు 400 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 223, ట్రంప్‌నకు 212 దక్కాయి. తొలుత డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌‌ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్‌ క్రమంగా పుంజుకొన్నారు. కీలకమైన స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్‌ ‌ఆధ్యిక్యంలో ఉన్నట్లు చూపించారు. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుతం అరిజోనా, న్యూహాంప్‌షైర్‌ మినహా మిగితా అన్ని చోట్ల ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది. ఫ్లోరిడా, ఐయోవా, ఒహియోలో విజయం సాధించగా.. నార్త్‌ కరోలినాలో విజయానికి దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిచిగాన్‌, పెన్సిల్వేనియా, టెక్సాస్‌, విస్కాన్సిన్‌‌లలో ఆయన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ గెలుపు సాధించబోతున్నాం.. దీనిపై రాత్రికి ప్రకటన చేస్తా.. విజయం మనదేనని, మన నుంచి ప్రత్యర్థులు విజయాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తుది ఫలితాల వరకు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓట్లు ఏలా ఏస్తారని నిలదీసిన ట్రంప్.. డెమొక్రాటిక్స్ కుట్రలను భగ్నం చేస్తామని స్పష్టం చేస్తారు. పోలింగ్ ముగిసినా ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ కొనసాగుతుండగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మాట్లాడుతూ.. గెలుపుపై తమకు నమ్మకుందన్నారు. తామే విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డెమొక్రాట్లు చాలా కష్టపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజలందరికీ బైడెన్ ధన్యవాదాలు తెలిపారు. మెట్రో నగరాల్లో ఓటర్లు తమకే పట్టం కట్టారని అన్నారు.


By November 04, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-election-2020-donald-trump-interesting-comments-on-results/articleshow/79036051.cms

No comments