Breaking News

ఫ్లోరిడాలో తలకిందులైన అంచనాలు.. విజయం దిశగా ట్రంప్!


అధ్యక్ష పీఠానికి చేరువ చేసేదిగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. ఈ రాష్ట్రంలో విజయం సాధించినవారికే అధ్యక్ష పీఠం దక్కుతుందనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తన అధ్యక్ష పదవిని నిలుపుకోవాలంటే ఇక్కడ గెలవాల్సిందేనన్న వాదన ఉంది. కానీ, ప్రీ-పోల్స్ మాత్రం బైడెన్‌ వైపే మొగ్గుచూపడంతో డెమొక్రాటిక్‌ పార్టీ విజయం తథ్యమనకున్నారంతా. కానీ, ఇక్క అంచనాలన్నీ తల్లకిందలయ్యాయి. తొలుత స్వల్ప ఆధిక్యం ప్రదర్శించిన .. క్రమంగా వ్యత్యాసాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. దాదాపు ఈ రాష్ట్రం ట్రంప్‌ చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 29 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది. ట్రంప్‌ బృందమైతే ఇప్పటికే తాము విజయం సాధించినట్టు ప్రకటించింది. వెస్ట్ వర్జీనియా, టెన్సీ, కెన్సాస్, మిస్సోరి, ఐడహో, యూటాలో విజయం సాధించగా.. కీలక రాష్ట్రాలైన జార్జియా, ఓహియో, టెక్సాస్‌లోనూ ట్రంప్‌ ఆధిక్యం కనబరుస్తున్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం ఇండియానా, కెంటకీ, మిస్సోరి, ఒక్లాహామా, టెన్నిసీ సహా మొత్తం 17 రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇవి రిపబ్లికన్‌ల సిట్టింగ్ స్థానాలే. ఫ్లోరిడాలో వెనుబడ్డ డెమొక్రాటిక్స్ కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ వంటి పెద్ద రాష్ట్రాలు, యూటా, న్యూమెక్సికో, మిన్నేసొటా, అరిజోనా, నెవాడాలో మాత్రం ట్రంప్‌ని వెనక్కి నెట్టారు. 2016లో ట్రంప్‌ గెలుచుకున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ బైడెన్‌ ముందంజలో ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు బైడెన్‌ 223 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో ముందంజలో ఉండగా.. ట్రంప్‌ 145 ఓట్లు సాధించారు. దీంతో ఇరువురి మధ్య తేడా భారీగా ఉంది. అయితే, కాస్తా వెనుకబడినా ట్రంప్ శిబిరంలో మాత్రం ఆశ చావలేదు. ఇప్పటి వరకు 45 రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. కాలిఫోర్నియా, ఇదాహో, ఒరేగాన్‌, వాషింగ్టన్‌లో కౌంటింగ్‌ పూర్తికాగా.. ‌, హవాయి, అలస్కా రాష్ట్రాల్లో కౌంటింగ్‌‌ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 68 శాతం పోలింగ్ నమోదయినట్టు అంచనా వేస్తున్నారు.


By November 04, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-polls-trump-gets-ohio-ahead-in-must-win-florida-in-nail-biter-with-biden/articleshow/79035326.cms

No comments