Breaking News

ఆమె ఉల్లిపాయల బండి ఇంటి ముందుకొస్తే ఔటే.! కిలాడీ లేడీ


రిక్షాలో ఉల్లిపాయలు వేసుకుని ఇంటింటికీ తిరుగుతుంది కిలాడీ లేడీ. ఆమె బండి ఏ ఇంటి ముందుకొచ్చి ఆగితే ఆ ఇల్లు గుల్లవ్వాల్సిందే. ఎవరూ లేని.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని మరీ పని కానిచ్చేస్తుంది. ఎంచక్కా ఇంట్లోకి చొరబడి పట్టపగలే చేసి దర్జాగా వెళ్లిపోతుంది. తాజాగా జిల్లా బాపట్లలో జరిగిన ఓ చోరీ కేసును ఛేదించిన పోలీసులు కిలాడీ లేడీని అరెస్టు చేసి భారీ మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాపట్ల పట్టణంలోని భీమావారిపాలెంలో నివాసముంటున్న శివరామ్‌ప్రసాద్ ఇంట్లో గత నెల 29న భారీ చోరీ జరిగింది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన సమయంలో పెద్దమొత్తంలో నగదు, బంగారం చోరీకి గురైంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివరామ్‌ప్రసాద్ కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే దొంగతనం జరిగిన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు పాతనేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. Also Read: అంతర్రాష్ట్ర దొంగ అయిన శీలం దుర్గపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుంచి రూ.16 లక్షల నగదు, రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె గతంలో తెలంగాణలోని కీసర, కృష్ణా జిల్లాలో పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కీసర దొంగతనం కేసుకు సంబంధించిన బంగారు ఆభరణాలను కూడా రికవరీ చేశామని.. తెలంగాణ పోలీసులకు సమాచారం అందించినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. Read Also:


By November 05, 2020 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-arrested-for-robbery-in-guntur/articleshow/79054594.cms

No comments