సినీ అసిస్టెంట్ డైరెక్టర్ మిస్సింగ్... పోలీసుల గాలింపు
తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ అనే యువకుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్తీక్(24) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ మధురానగర్‌లో నివాసముంటూ సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం తన కొడుకు కనిపించడం లేదని కార్తీక్ తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: కొద్దిరోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆ మరుసటి రోజే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇంటికి కాకుండా మాదాపూర్‌లోని ఫ్రెండ్స్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి స్నేహితులతో పంజాగుట్ట చేరుకున్న కార్తీక్ ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కార్తీక్ తండ్రి లక్ష్మీనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: కార్తీక్ ఇటీవల తన స్నేహితులైన వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ కోసం రూ.10లక్షలు పెట్టించాడని ఫిర్యాదులో ఆయన తండ్రి పేర్కొన్నారు. అందులో నష్టం రావడంతో ఫ్రెండ్స్ నుంచి ఒత్తిడి పెరిగిందని, దాన్ని తట్టుకోలేకే కనిపించకుండా పోయి ఉంటాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చేపట్టారు.
By November 24, 2020 at 12:13PM
No comments