Breaking News

నీ చుట్టూ ఉన్నవాళ్లు అబ్జర్వ్‌ చేస్తారు.. జాగ్రత్త! అన్నింటికంటే అదే ముఖ్యం.. పూరి పాఠం వినాల్సిందే..


గత కొన్నిరోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ ఆడియోలను రిలీజ్ చేస్తున్న సమాజంలోని విభిన్న అంశాలపై స్పందిస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్ని విషయాల్లో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనపై మనకు నియంత్రణ అనేది అవసరం అని పేర్కొంటూ '' అనే టాపిక్‌పై ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇందులో పూరి చెప్పిన కొన్ని విషయాలు వాస్తవికతకు దగ్గరగా ఉండి ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''ఐక్యూ చాలా మందికి ఉంటుంది. ఈక్యూ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈక్యూ అంటే ఎమోషనల్‌ కోషెంట్‌. దీనినే ఎమోషనల్‌ ఇంటిలిజెన్స్‌ అంటారు. ఇట్స్‌ ఎన్‌ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్‌ అండ్‌ మెనేజ్‌ యువర్‌ ఎమోషన్స్‌. ఈ ఎమోషనల్‌ ఇంటిలిజెన్స్‌ ఉన్నోళ్లు.. గుడ్‌ లీడర్స్‌ అవుతారు. ఇందులో నాలుగు ఉంటాయ్‌. సెల్ఫ్‌ అవేర్‌నెస్‌, సెల్ఫ్‌ మ్యానేజ్‌మెంట్, సోషల్‌ అవేర్‌నెస్‌, రిలేషన్‌షిప్ మ్యానేజ్‌మెంట్‌. ఈ నాలుగూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, స్ట్రెంత్‌, వీక్‌నెస్.. ఇవన్నీ తెలియకుండా మనల్ని డ్రైవ్‌ చేస్తుంటాయ్‌. అందుకే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హౌ యు రియాక్ట్ టు పీపుల్‌. వాళ్లని ఎలా పలకరిస్తున్నావ్‌? ఎలా మాట్లాడుతున్నావ్‌? చెక్‌ చేసుకోవాలి. వాళ్లతో మనం మాట్లాడే విధానం ఎలా ఉందో గమనించాలి. అలాగే ఒత్తిడి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామ్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. డిప్రెస్‌ అవుతున్నామా? గట్టిగా అరుస్తున్నామా? లేదా గట్టిగా ఏడుస్తున్నామా? ఇవన్నీ నువ్‌ అబ్జర్వ్ చేయకపోయినా.. నీ చుట్టూ ఉన్నవాళ్లు అబ్జర్వ్‌ చేస్తారు. అందుకే మనం ఏంటో మనకి తెలియాలి. ప్రాబ్లమ్‌ వచ్చినప్పుడు దానిని నువ్ డీల్‌ చేసే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు. వర్క్‌ చేసే చోట కూడా కామ్‌గా ఉండటం, అవతలి వాళ్లు చెప్పేది వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌. మిస్టేక్‌ జరిగితే ఎప్పుడూ ఎస్కేప్ అవ్వవద్దు. ఆ బాధ్యతను మీరే తీసుకోండి. మనలో ఉన్న ఎమోషన్స్ తగ్గించుకోవాలి. ఎంత గుడ్ న్యూస్ విన్నా డాన్సులు చేయడం, అరవడం లాంటివి చేయకూడదు. బ్యాలెన్స్ మైండ్‌ని అందరూ నమ్ముతారు. వాళ్లనే సలహా అడుగుతారు. ఫ్రెండ్స్ గానీ, రెలెటివ్స్ గానీ సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అందరి జీవితంలో 'ఎమోషనల్ ఇంటలిజెన్స్' అనేది చాలా ముఖ్యం'' అని అన్నారు.


By November 24, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/puri-jagannadh-says-about-emotional-intelligence/articleshow/79383943.cms

No comments