మూడు సినిమాలు.. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్.. ప్రభాస్ రేంజ్ ఇది
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా ఎదిగాడు. దీంతో ఆయన్ని అభిమానులు ముద్దుగా యంగ్ రెబల్ స్టార్ అని పిలిచేవారు. అయితే బాహుబలి సినిమా ఆయన బిరుదును మార్చేయడమే కాకుండా... తెలుగులో ఏ హీరోకి లేనంతగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాకు అన్ని హద్దులు చెరిపేసి ఆలిండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. దక్షిణాదిని మించి బాలీవుడ్‌లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో పెద్దగా ఆడకపోయినా బాలీవుడ్‌ని మెప్పించింది. అక్కడ ఏకంగా రూ.100కోట్లకు మించి కలెక్షన్లు సాధించి ప్రభాస్ సత్తా మరోసారి చాటింది. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎప్పుడొస్తుందోనని బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’, నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘’లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాల బడ్జెట్ మొత్తం ఎంతో తెలుసా... అక్షరాలా రూ.వెయ్యి కోట్లు. Also Read: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా మ్యూజిక్ టీచర్‌గా కనిపించనున్నారు. రాధాకృష్ణకుమార్ డైరెక్టర్. ఇటీవలే ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. హైదరాబాద్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.30కోట్లతో సెట్ వేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ రూ.250కోట్లు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకుండానే రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది ‘ఆదిపురుష్’ టీమ్. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.450కోట్లు. అలనాటి కథానాయిక సావిత్రి బయోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కించి సంచలనం విజయం సాధించిన నాగ్అశ్విన్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ రూ.300కోట్లు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే రొమాన్స్ చేయనుంది. Also Read:By November 27, 2020 at 12:22PM
No comments