Breaking News

అక్కా.. ఆడిస్తానంటూ చిన్నారిని తీసుకెళ్లి.. దారుణం


అక్కా.. పాపని ఆడిస్తానంటూ నాలుగేళ్ల చిన్నారిని తీసుకెళ్లాడు పక్కింటి కుర్రాడు. ఇరుగుపొరుగునే కదా అని చిన్నారిని పంపించిందా తల్లి. పాప ఇంటికొచ్చి కడుపునొప్పని ఏడుస్తుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకి గుండెపగిలినంతపనైంది. పసిపాపపై పశువు పంజా విసిరిందని తెలిసి నిర్ఘాంతపోయారు. చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు. ఈ అత్యంత అమానుష ఘటన జిల్లాలో జరిగింది. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(19) తల్లితో కలసి ఉంటున్నాడు. అతని ఇంటి పక్కనే ఇద్దరు చిన్నారులతో కలసి కుటుంబం నివసిస్తోంది. వారి నాలుగేళ్ల కూతురు తరచూ పక్కనే ఉన్న యువకుడి ఇంటికి వెళ్లి ఆడుకునేది. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం యువకుడు పక్కింటికి వెళ్లి అక్కా పాపను ఆడిస్తానంటూ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటర్ పూర్తి చేసి చెడువ్యసనాలకు బానిసైన యువకుడు చిన్నారిపై కన్నేశాడు. అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన చిన్నారి కడుపు నొప్పిగా ఉందని ఏడుస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఏమైందని యువకుడిని ప్రశ్నించారు. అందుకు అతను పొంతనలేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చిన్నారిని తగరపువలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కుదేలైపోయారు. Also Read: ఇంటికి వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో వెంటనే సచివాలయం మహిళా కానిస్టేబుల్‌కి సమాచారమిచ్చారు. ఆమె వెంటనే భోగాపురం పోలీస్ స్టేషన్‌లో తెలియజేయడంతో సీఐ, ఎస్సై గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. దిశ పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించడంతో దిశ డీఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. Read Also:


By November 27, 2020 at 12:54PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/four-year-old-girl-raped-in-vizianagaram/articleshow/79442665.cms

No comments