Breaking News

ప్రభాస్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్... ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్


యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ‘’పై యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్‌ను మాత్రమే సెలక్ట్ చేయగా.. మిగిలిన తారాగణాన్ని ఎంపి చేసే పనిలో ఉంది యూనిట్. అసలు షూటింగే ప్రారంభం కాలేదు.. అప్పుడే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌తో పాటు షాకిచ్చింది. గురువారం ఉదయం 7.11 గంటలకు సర్‌ప్రైజ్ ఇస్తున్నామంటూ ప్రభాస్ బుధవారం రాత్రి సోషల్‌మీడియాలో ఓ ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ ప్రకటన దేనికి సంబంధించిందోనని వారికి నిద్ర కూడా పట్టలేదు. సరిగ్గా గురువారం ఉదయం 7.11 గంటలకు దర్శకుడు ఓం రౌత్ తన ట్విట్టర్‌లో షాకింగ్ ప్రకటన చేశారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆగస్టు 11, 2022లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సీత పాత్రధారిని పరిచయం చేస్తారనుకుంటే అంతకుమించి కిక్కిచ్చే న్యూస్ ప్రకటించారంటూ ‘ఆదిపురుష్’ టీమ్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భూషణ్‌ కుమార్‌, రాజేష్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారు.


By November 19, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-starrer-adipurush-movie-release-date-announced/articleshow/79294374.cms

No comments