Breaking News

అల్‌ఖైదా అగ్రనేత అల్-మస్రీ, లాడెన్ కోడలు మిరియం ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హతం


ఉగ్రవాద సంస్థ కీలక నేత, ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై వరుస దాడుల ప్రధాన సూత్రధారిని మూడు నెలల కిందట ఇరాన్‌లో మట్టుబెట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెల్లడించింది. అబ్దల్లాహ్ అహమద్ అబ్దుల్లాహ్‌ అలియాస్ అబు మొహమూద్ అల్-మస్రీని టెహ్రాన్ వీధుల్లో ఆగస్టు 7న హతమార్చినట్టు అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరించాయని ఆ కథనంలో పేర్కొంది. ఆగస్టు 7న టెహ్రాన్ వీధుల్లో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న అల్-మస్రీని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయని వివరించింది. ఈ దాడిలో మస్రీ కుమార్తె, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కోడలు మిరియమ్‌ కూడా హతమైనట్టు తెలిపింది. లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌‌ను అమెరికా సైన్యం గతంలోనే మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అమెరికా రాయబార కార్యాలయాలపై దాడి జరిగిన తేదీనే మస్రీని మట్టుబెట్టడం విశేషం. అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్ దళాలు ఈ ఆపరేషన్‌ చేపట్టినట్టు నలుగురు అధికారులు చెప్పినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఇందులో అమెరికా సైన్యం పాల్గొందా? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఉగ్రవాదుల కార్యకలాపాలు, అల్-మస్రీ కదలికలపై చాలా సంవత్సరాలుగా పర్యవేక్షణ కొనసాగుతోంది. అల్-మస్రీ చనిపోయినట్టు వదంతలు వచ్చినా.. ఇప్పటి వరకూ ఎవరూ ధ్రువీకరించలేదు. భౌగోళిక రాజకీయ విధానం, తీవ్రవాద నిరోధంలో భాగంగా మస్రీని మట్టుబెట్టారు. అయితే, అస్పష్ట కారణాల వల్ల అల్ ఖైదా తన అగ్ర నేత మరణం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరాన్ అధికారులు సైతం దానిని బయటపెట్టలేదు సరికదా ఏ దేశమూ బహిరంగంగా దీనికి బాధ్యత వహించలేదు.


By November 15, 2020 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/al-qaeda-top-most-leader-accused-in-us-embassy-attacks-was-killed-in-iran/articleshow/79228443.cms

No comments