Breaking News

కోర్టుకెక్కిన అమలాపాల్.. మాజీ ప్రియుడిపై కేసు నమోదు


కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నటి . అయితే ఏడాది తిరగకముందే మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు సింగిల్‌గానే ఉన్న ఆమె ఇటీవలే వేరొకరితో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. అతడి పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి నెలలో సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో పెళ్లి దుస్తుల్లో ఉన్న అమలా పాల్ ఫోటోలు వైరల్‌‌గా మారాయి. Also Read: దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనుకున్న చాలామంది సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కాసేపటికే ఆ ఫోటోలు డిలీట్ అయ్యాయి. దానిపై స్పందించిన అమలాపాల్.. ఆ ఫోటోలు ఓ కారణం కోసం తీసినవని, కానీ భువ్‌నిందర్ సింగ్ తప్పుగా వాడారని తెలిపింది. ఇదే విషయంపై అమలాపాల్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తన ఫోటోలను అనుమతి లేకుండా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు, పెళ్లయిందంటూ పుకార్లు సృష్టించిన భువ్‌నిందర్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అమలాపాల్‌ ఫిర్యాదు చేసింది. దీంతోపై పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భువ్‌నిందర్ సింగ్, అమలాపాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని విడిపోయారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ వేరుపడిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో భువ్‌నిందర్ సింగ్‌ను ఆమె అన్‌ఫాలో చేసిందని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంపై అమలాపాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. Also Read:


By November 04, 2020 at 10:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-amala-paul-moves-court-to-take-action-against-bollywood-singer-bhavninder-singh/articleshow/79034547.cms

No comments