Breaking News

ట్రంప్ టైం అస్సలు బాలేదు: ఓవైపు ఓటమి.. అటు విడాకులకు సిద్ధమైన మెలానియా!


రోజులు అస్సలేం బాలేవు.. ఓవైపు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్‌నకు.. మరో కష్టం వచ్చి పడనుంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగియాంటూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. అధికార మార్పిడికి ససేమిరా అంటున్నా శ్వేతసౌధాన్ని వీడక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా.. అధ్యక్ష పీఠం దిగిన మరుక్షణమే వివాహ బంధానికి స్వస్తి పలకాలని భార్య భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె మాజీ సహాయకురాలు మాటలను ఉటంకిస్తూ ది డైలీ మెయిల్‌ యూకే ఒక కథనాన్ని ప్రచురించింది. ‘వారిది 15 ఏళ్ల ఒప్పంద వివాహం.. కలిసి ఫొటోలకు ఫోజులిస్తున్నా.. మంచాలు మాత్రం దూరం’ అని మెలానియా మాజీ సహాయకురాలు స్టెఫానీ వోకాఫ్‌ అన్నట్టు కథనంలో తెలిపింది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే రోజు.. ఆయనకు విడాకులిచ్చే సమయం కోసం మెలానియా ఘడియలు లెక్కిస్తోంది’ అని ట్రంప్ రాజకీయ సహాయకురాలు ఒమరోసా మెనిగాట్‌‌ చెప్పినట్టు వివరించింది. రెండో భార్య మార్లాతోనూ ట్రంప్‌ది ఒప్పంద వివాహమేనని, దాని ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి విషయాలను బయటపెట్టకూడదని సదరు పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మెలానియాతో రహస్య ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడడం లేదని సందేహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దీనికి మరింత బలానిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో మెలానియా ట్రంప్ కన్నీటి పర్యంతమయ్యారని, ట్రంప్ విజయం సాధిస్తారని అసలు ఊహించలేదని ఆమె స్నేహితులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటన సందర్భంగా మెలానియా చేయి అందుకోడానికి ట్రంప్‌ ప్రయత్నించగా.. ఆమె కాస్త విసురుగా ప్రవర్తించారు! మా మధ్య గొప్ప అనుబంధం ఉందని మెలానియా బయటకు చెప్పుకుంటున్నా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల తర్వాత మెలానియా వైట్‌హౌస్‌కు వచ్చారు. తన కుమారుడు బారన్ ట్రంప్ చదువు మధ్యలో ఉండటంతోనే న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు రావడానికి ఆలస్యమైనట్టు మెలానియా అప్పట్లో చెప్పారు. కానీ, స్టెఫానీ వోల్కాఫ్ మాత్రం.. ట్రంప్ సంపదలో బారన్‌కు సమాన వాటా ఇవ్వాలని మెలానియా పట్టుబట్టారని, అందుకే ఆమె ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు.


By November 09, 2020 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/melania-to-divorce-donald-trump-former-aides-claim-she-is-counting-the-minutes/articleshow/79124394.cms

No comments