పకోడీల కోసం రచ్చ... సూర్యకాంతం కాళ్ల మీద పడిన క్యాంటీన్ యజమాని

సినిమాలో చేసే పాత్రల ప్రభావం నటుల నిజ జీవితంపై పడుతుందా? అని అడిగితే..కచ్చితంగా అవుననే చెప్పాలి. పాతతరం నటుడు చిత్తూరు నాగయ్య.. పోతన పాత్ర చేసిన తర్వాత పూర్తిగా రామభక్తుడు అయిపోయారు. వేమన పాత్రతో సాధు వర్తనం అలవాటు చేసుకున్నారు. ‘అంతకుముందు నాకు బాగా కోపం వుండేది. తర్వాత తగ్గిపోయింది’ అని చెప్పారు నాగయ్య. సినిమాల్లో ప్రేమికులుగా, భార్యభర్తలుగా నటించిన చాలామంది నటీనటులు నిజజీవితంలోనూ ప్రేమపెళ్లితో ఒక్కటైనవాళ్లున్నారు. Also Read: సినిమాల్లో గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరైన బయట శాంత స్వభావంతోనే ఉండేవారు. అయితే ఆమెకు కోపం వస్తే మాత్రం ఎవరూ తట్టుకోలేకపోయేవారు. ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె సారధి స్టూడియోలో క్యాంటీన్ వాడికి సాయంకాలం పకోడి చేయమన్నారు. తీరా సాయంకాలం ‘అందరికీ పకోడి తీసుకురా’ అని ప్రొడక్షన్ వాళ్లకి చెబితే, అతడు వెళ్లి ‘పకోడి చెయ్యలేదమ్మా.. -బజ్జీ చేశాడట’ అని చెప్పారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన సూర్యకాంతం.. ఆ క్యాంటీన్ వాడి మీద అంతెత్తున అరిచారట. ‘చెప్పినప్పుడు చేస్తానని ఎందుకన్నావు? చెయ్యలేకపోతే నాకొచ్చి చెప్పాలా లేదా? నీ యిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యడం ఏమిటి? ఈ బజ్జీలు నేను చెయ్యమనలేదు. నేను డబ్బు ఇవ్వను. నీ యిష్టం వచ్చినవాడికి చెప్పుకో, ఎక్కువ మాట్లాడితే పెద్దవాళ్లతో చెప్పి నీ క్యాంటీన్ ఎత్తించేస్తా’ అని సూర్యకాంతం మండిపడ్డారంట. దీంతో బెదిరిపోయిన క్యాంటీన్ యజమాని ఆమె కాళ్లపై పడి క్షమించాలని వేడుకున్నాడట.
By November 09, 2020 at 12:58PM
No comments