Breaking News

గుంటూరులో ప్రేమ పేరుతో దారుణం.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ యువతి హత్య


గుంటూరులో దారుణ ఘటన ఆలస్యంగా బయటపడింది. ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హత్య చేశాడు. పాత గుంటూరు‌లోని ఆలీనగర్‌కు చెందిన యువతి 2018లో అదృశ్యమైంది. పెళ్లికి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఆ యువతి తిరిగి రాలేదు. పాత స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.. కొద్ది రోజులపాటు గాలించి పోలీసులు వదిలేశారు. తాజాగా యువతి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు ఐజీని కలిశారు. తమ కూతురి అదృశ్యం వెనుక కారణాలను వివరించారు.. కీలక సమాచారం కూడా అందించారు. ఐజీ ఆదేశాలతో నాగూర్‌ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి అదృశ్యంపై అతడ్ని ప్రశ్నించారు.. ఆమెను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు.. ఆమె ప్రేమకు నిరాకరించడంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. రెండేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది. ఇన్నాళ్లు తమ బిడ్డ ఎక్కడో చోట బ్రతికే ఉంటుందని భావించిన తల్లిదండ్రులు.. మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. ఏపీలో ఇలాంటి తరహా ఘటనలు రెండు జరిగాయి. విజయవాడలో నాగేంద్ర తేజస్విని హత్య చేయగా.. విశాఖలో వరలక్ష్మిని అఖిల్ అనే యువకుడు దారుణంగా చంపేశాడు. ఆ రెండు ఘటనలు మరువక ముందే తాజా ఘటన కలకలంరేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By November 09, 2020 at 01:10PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-murder-reveal-after-two-years-in-guntur/articleshow/79125031.cms

No comments