Breaking News

ఫలితాలు వచ్చిన తర్వాత జో చర్చ్‌లో ప్రార్ధనలు నిర్వహిస్తే.. ట్రంప్ ఏం చేశారో తెలుసా?


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దోబూచులాడిన విజయం ఎట్టకేలకు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను వరించింది. గెలుపుపై బీరాలు పోయిన డొనాల్డ్‌ ట్రంప్ చతికిలపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్.. ఆదివారం చర్చ్‌కి వెళ్లారు. తన కుటుంబంతో కలిసి ఆయన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అటు, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్.. వర్జీనియాలోని గోల్ఫ్ కోర్టులో గడిపారు. డేలావేర్‌ న్యూ క్యాస్టల్ కౌంటీలోని పురాతన రోమన్ క్యాథలిక్ సెయింట్ జోసెఫ్ చర్చ్‌లో కుమార్తె యాష్లే బైడెన్, మనవడితో కలిసి ప్రార్థనలు చేశారు. వాషింగ్టన్ డీసీ శివారులోని వర్జీనియాలో గోల్ఫ్ ఆడుతూ గడిపిన ట్రంప్‌నకు అక్కడ విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఆయనకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు ఫ్లాకార్డులు ప్రదర్శించారు. ‘ఆరెంజ్ క్రష్‌డ్’, ‘ట్రంప్టీ డంప్టీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్’ అంటూ ఆయన ఎదుట ప్రదర్శనలు చేశారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్.. విజయోత్సవ ప్రసంగంలో తన తల్లి గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నేను నా తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్‌ సహా అంతకు ముందు వచ్చిన నల్లజాతి మహిళల గురించి ఆలోచిస్తున్నాను.. నమ్మకం బలంగా ఉంటే అమెరికాలో ఇలాంటి క్షణం సాధ్యమే’ అన్నారు. ఓడిపోయినప్పటికీ ట్రంప్ ఆ విషయాన్ని అంగీకరించకపోవడం విశేషం. మరో గంటలో ఫలితాలు రాబోతున్నాయి... నేను భారీ విజయం సొంతం చేసుకోబోతున్నా అని శనివారం ఉదయం ట్వీట్ చేశాడు. ఎప్పుడు సూట్‌లో కనిపించే ట్రంప్ ఉన్నట్టుండి గోల్ఫ్ దుస్తుల్లో తెల్లటి క్యాప్ పెట్టుకొని గోల్ఫ్ కోర్టులో ఆటగాడిగా మారిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఓటమి బాధ ట్రంప్ లో ఏ మాత్రం కనిపించలేదు.


By November 09, 2020 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-election-joe-biden-goes-to-church-donald-trump-hits-golf-course-day-after-result/articleshow/79121090.cms

No comments