Breaking News

బాబాయ్‌తో అబ్బాయ్.. క్రేజీ కాంబో సెట్ చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ


సినిమాలో హీరో రెండు ఫైట్లు, నాలుగు పంచ్ డైలాగులు, మూడు పాటల్లో డ్యాన్సులు చేస్తే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కనిపిస్తే.. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇక ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు చూస్తున్నంత సంబరపడిపోతుంతారు అభిమానులు. అక్కనేని కుటుంబమంతా కలిసి తీసిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ కోవలోనే దగ్గుబాటి హీరోలు కూడా ఒకే తెరపై కనిపించేలా సన్నాహాలు జరుగుతున్నారు. Also Read: ప్రస్తుతం చిరంజీవి - రామ్‌చరణ్‌ కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని వచ్చే యేడాదిప్రకటించబోతున్నారు. ఆ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. బాబాయ్‌‌తో కలిసి తాను సినిమా చేస్తున్నానని, స్టోరీతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని రానా తెలిపారు. అయితే రానా ‘విరాటపర్వం’ , ‘నారప్ప’ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయిన తర్వాత ఈ మల్టీస్టారర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Also Read: గతేడాది వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఈ సారి బాబాయ్-అబ్బాయ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారన్నమాట. అయితే వీరిద్దరు సినిమాలో కనిపింంచడం ఇదే తొలిసారి కాదు. క్రిష్, రానా కాంబినేషన్లో తెరకెక్కించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలోని ఓ పాటలో వెంకటేష్‌ కాసేపు సందడి చేశారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వెంకటేష్‌కు కొత్తేమీ కాదు. మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. Also Read:


By November 09, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rana-and-venkatesh-will-do-multistarrer-confirmed/articleshow/79120795.cms

No comments