Breaking News

ఫ్రెండ్ భార్యకి మత్తుమందిచ్చి దారుణం.. వీడియోలు తీసి.!


ఫ్రెండ్ భార్యపై కన్నేసిన కీచకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెకు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు ఆ వీడియోలు చూపించి అందినకాడికి దోచుకున్నాడు. తీరా నగలేవని కుటుంబ సభ్యులు అడగడంతో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా మత్తికెరిశెట్టిహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ తన ఫ్రెండ్ భార్యపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి సమీపంలోని సావనదుర్గకు తీసుకెళ్లాడు. ఆమెకు మత్తుమందిచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మత్తులో ఉన్న ఫ్రెండ్ భార్యపై అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియోలు తీసి భద్రపరచి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమె నగలు అమ్మేసి నగదు అందజేసింది. తీరా నగలేమయ్యాయని కుటుంబ సభ్యులు బాధితురాలిని అడగడంతో భర్త స్నేహితుడి దురాగతం బయటపడింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాధితురాలికి అండగా నిలబడడంతో ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. Also Read:


By November 01, 2020 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-rapes-friends-wife-in-karnataka/articleshow/78978211.cms

No comments