Breaking News

భార్య, కొడుకుని నరికేసిన భర్త.. పశ్చిమ గోదావరిలో దారుణం


జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి భార్య, కొడుకుని గొడ్డలితో నరికేశాడో కసాయి భర్త. తీవ్రగాయాలతో ఆసత్రిపాలైన కొడుకు చికిత్స పొందుతూ మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన నల్లజర్ల మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంబాబు కుటుంబ కలహాల కారణంగా విచక్షణ కోల్పోయి ఘాతుకానికి తెగబడ్డాడు. అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో భార్య, కుమారుడిని కిరాతకంగా నరికేశాడు. తీవ్రగాయాలపాలైన తల్లీకొడుకులను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొడుకు అచ్చారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన భార్య కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:


By November 18, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-hacks-wife-son-with-an-axe-in-west-godavari/articleshow/79276076.cms

No comments