Breaking News

నటి కుష్బూకి తప్పిన ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు


ప్రముఖ తమిళ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు కుష్బూకు బుధవారం త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. వేల్ యాత్రలో పాల్గొనేందుకు పార్టీ నేతలతో కలిసి వెళ్తున్న కుష్బూ కారును విల్లుపురం జిల్లా మెల్మార్‌వతుర్ పట్ణణ సమీపంలోని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కుష్బూ ఎలాంటి గాయాలు కాకుండా త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. కుష్బూ డ్రైవర్ పక్కన కూర్చోవడంతో సురక్షింతంగా బయటపడ్డారు. Also Read: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నంలో భాగంగా నవంబరు 6వ తేదీ నుంచి డిసెంబరు 6వరకు తమిళనాడులో బీజేపీ వేల్‌ యాత్ర చేపట్టింది. ఇందులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. తిరుత్తణిలో ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 6న తిరుచ్చెందూరులో ముగియనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగానే కుష్బూ వాహనం ప్రమాదానికి గురైంది.


By November 18, 2020 at 10:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bjp-leader-and-actress-khushboo-sunder-meets-accident-escapes-unhurt/articleshow/79276257.cms

No comments