ఆక్స్‌ఫర్డ్ టీకా.. ఆ క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిగణనలోకి తీసుకోనున్న కేంద్రం
రెండు డోస్‌ల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ పరిశీలిస్తోంది. తాము అభివృద్ధి చేసిన రెండు డోస్‌ల టీకా 62 శాతం, ఒక్క డోస్ టీకా 90 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఇటీవల ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెండు డోస్‌ల టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై భారత్ సానుకూలంగా స్పందించడం.. ఇదే సమయంలో నిపుణులు విమర్శల నేపథ్యంలో టీకా తయారీలో లోపం ఉందని ఆస్ట్రాజెన్‌కా అంగీకరించింది. రెండు డోస్‌ల వ్యాక్సిన్ కంటే ఒక మోతాదు టీకా మెరుగైన ఫలితాలను అందించగలదని తేలింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులెటరీ ప్రకారం టీకా సమర్ధత 50 శాతం ఉంటే సరిపోతుంది. దేశంలో క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదం పొందిన రెండు డోస్‌ల టీకా 62 శాతం సమర్థత చూపిందని, దీనిని రెగ్యులేటరీ పరిశీలన తర్వాత వినియోగం కోసం ఆమోదించవచ్చని భారత అధికారులు తెలిపారు. శాస్త్రీయంగా సంతృప్తి వ్యక్తమయితే అత్యవసర వినియోగానికి ఈ టీకా సరిపోతుందన్నారు. దేశంలో ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ సజావుగా కొనసాగుతున్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారి ఒకు తెలిపారు. రెగ్యులేటరీ డేటాను పరిశీలించడానికి వేచి చూడాలని, ఏదైనా శాస్త్రీయంగా జరగాలని కోవిడ్ నిపుణుల కమిటీ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ వ్యాఖ్యానించారు. అత్యంత కీలకమైన సమచారాన్ని వ్యాక్సిన్ తయారీదార్లు బహిర్గతం చేయడం అశాస్త్రీయమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి డేటా భద్రత, పర్యవేక్షణ బోర్డు పరిశీలన కోసం ఉద్దేశించింది.. ఇది చాలా గోప్యంగా ఉంటుంది.. ఇటువంటి సమాచారం బహిరంగ చర్చకు ఉద్దేశించింది కాదు, ఎందుకంటే ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు’ అన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు మాట్లాడుతూ.. ‘మనం ఓపికపట్టాలి.. ఆందోళన పడరాదు.. అవసరమైన అన్ని ప్రక్రియలు, ప్రోటోకాల్‌ను కఠినంగా పాటించడంతో సహా దేశంలో ట్రయల్స్ సజావుగా నడుస్తున్నాయి.. ఇప్పటివరకు, ఎటువంటి ఆందోళనలు లేవు. అయినప్పటికీ, మేము అందుబాటులో ఉన్న డేటా ద్వారా ముందుకు వెళుతున్నాం.. అవసరమైతే దీనిపై ప్రకటన చేస్తాం’ అన్నారు. ఆస్ట్రాజెన్‌కా ప్రాధమిక డేటా గురించి కూడా వ్యాఖ్యానించారు. ‘విభిన్న మోతాదు రూపాలతో విభిన్న వయస్సుల వారిలో స్వల్ప వ్యత్యాసాలు, సమర్థతకు దారి తీస్తాయి’ అని అన్నారు.
By November 27, 2020 at 11:00AM
No comments