హిస్టరీ అంటే బాలయ్యదే.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. 100డేస్
తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల దగ్గర అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఒకే హీరోకి చెందిన రెండు సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయితే వారి ఆనందం రెట్టింపు కావడం ఖాయం. అలాంటి అనుభూతి ఫ్యాన్స్‌కే దక్కింది. Also Read: బాలకృష్ణ నిప్పురవ్వ, సినిమాలు 1993 సెప్టెంబర్ 3 విడుదలయ్యాకి. ఇందులో హిట్ కాగా... బంగారు బుల్లోడి బాలయ్యకు సూపర్‌హిట్ అందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య డేరింగ్ స్టెప్ తీసుకుని రెండు సినిమాలను ఒకేరోజు విడుదల చేసి సక్సెస్ అయ్యారు. నిప్పురవ్వ సినిమాకు ఆయనే నిర్మాత కావడం మరో విశేషం.
యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ తెరకెక్కింది. సింగరేణి బొగ్గు కార్మికుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్. ఈ సినిమాకి బప్పీ లహరి సంగీతం అందించగా... ‘రండి కదిలి రండి’ పాటను రాజ్-కోటి స్వరపరిచారు.. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ.ఆర్.రెహమాన్ అందించారు. అప్పటి వరకు తెలుగులో వచ్చిన సినిమాల్లోకెల్లా ‘నిప్పురవ్వ’ భారీ బడ్జెట్‌లో తెరకెక్కింది. Also Read: జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.4కోట్ల బడ్జెట్ కేటాయించారు. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లు. నిజానికి ‘నిప్పురవ్వ’ సినిమా ముందుగా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో సినిమాను ఆపేయాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విడుదల వాయిదా పడింది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చే సమయానికి ‘బంగారు బుల్లోడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఇతర హీరోల సినిమాలేవీ లేకపోవడంతో రెండు బ్యానర్లు ప్రొడ్యూసర్లు చర్చించుకుని నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలను ఒకేరోజు విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు రాజమండ్రిలో 100రోజులు ఆడటం విశేషం. అలా ఒకేరోజు తన రెండు సినిమాలను విడుదల చేసి రెండూ వంద రోజులు ఆడిన హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయారు.By November 27, 2020 at 11:25AM
No comments