Breaking News

సూర్య పక్కన ఛాన్స్ అంటే జాక్‌పాట్ కొట్టినట్లే: అపర్ణా బాలమురళి


‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళీ భామ . సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన వారందరూ సూర్య నటన, డైరెక్టర్ సుధా కొంగర టేకింగ్‌తో పాటు హీరోయిన్‌ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుతున్నారు. సూర్య భార్య పాత్రలో ఆమె కనబర్చిన అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఆడిషన్స్‌కు వెళ్లే వరకు సినిమాలో సూర్య హీరో అని తనకు తెలియదని, ఆయనతో కలిసి నటించడం జాక్‌పాట్ కొట్టినంత ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది అపర్ణ. అనేక షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించిన నాకు మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ సుమారు 15 సినిమాల్లో నటించా. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు హీరోయిన్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి చెన్నై వెళ్లా. అక్కడ దర్శకురాలు సుధాకొంగరా చెప్పినట్లుగా ఓ చిన్న సన్నివేశంలో నటించి చూపించా. అక్కడ పోస్టర్‌లో సూర్యను చూసేవరకు ఆయనే హీరో అని తెలియదు. దీంతో సూర్య పక్కన నటించే ఛాన్స్ దక్కుతుందో లేదో అని టెన్షన్ పడ్డారు. చివరిక నన్ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు యూనిట్ ఫోన్ చేసి చెప్పడంతో జాక్‌పాట్ కొట్టినంత సంబరపడిపోయా’ ‘ఈ సినిమాలో నా పాత్ర సహజ సిద్ధంగా రావడానికి కారణంగా డైరెక్టర్ సుధ. నటీనటులు, యూనిట్‌ అందరికీ ఏడాదిపాటు వర్క్‌షాపు నిర్వహించారామె. ఇందులో నాది ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్న పాత్ర. భాష దగ్గర సమస్య రావడంతో ఏడాది పాటు స్ర్కిప్టు చదువుతూ, మాట్లాడుతూనే ఉన్నాను. మాది కేరళలో పాలక్కాడు. అమ్మ శోభ, నాన్న బాలమురళి ఇద్దరూ సంగీత కళాకారులే. నాకూ చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి. అందుకే బాలనటిగా నటనను మొదలుపెట్టా. తెలుగులో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ఈ సినిమా షూటింగులో సూర్య అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఆయన సహనాన్ని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే’ అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు అపర్ణా బాలమురళి.


By November 17, 2020 at 08:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-aparna-balamurali-sensational-comments-on-hero-suriya/articleshow/79254735.cms

No comments