Breaking News

కూతురు చేయి పట్టుకుని.. ఆమె తల్లిని కడుపులో తన్ని.. గ్రామ వాలంటీర్ అరాచకం


ఏపీ ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ కొందరు కీచకుల కారణంగా అభాసుపాలవుతోంది. మద్యం మత్తులో ఉన్న వాలంటీర్ రాత్రివేళ ఇంటికి వెళ్లి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. అడ్డుకోబోయిన ఆమె తల్లిని సైతం దారుణంగా కొట్టాడు. కేకలు విని ఆమె తండ్రి రావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. యద్దనపూడి మండలం సూరారపల్లికి చెందిన టీనేజ్ యువతి మార్టూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమెపై కన్నేసిన గ్రామ వాలంటీర్‌ అక్కిశెట్టి రాజేష్ రాత్రి 9 గంటల సమయంలో మద్యం మత్తులో యువతి ఇంటికెళ్లాడు. ఆధార్ కార్డు, పొలం పాసుపుస్తకం కావాలని అడిగాడు. అవి తెచ్చేందుకు వెళ్తున్న యువతిని చేయిపట్టుకుని పక్కకు లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఊహించని పరిణామంతో బెంబేలెత్తిపోయిన యువతి పెద్దగా కేకలు పెట్టింది. Also Read: కూతురు కేకలు విని తల్లి ఇంటి నుంచి బయటికి వచ్చింది. వాలంటీర్ రాజేష్‌ వికృత చేష్టలను ప్రశ్నించడంతో అరాచకానికి దిగాడు. తల్లిని కడుపులో కాలితో తన్ని అసభ్యకరంగా దుర్భాషలాడాడు. స్నానం చేస్తున్న తండ్రి.. తల్లీకూతుళ్ల కేకలు విని పరుగున వచ్చేసరికి వాలంటీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలితి ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మైనర్‌‌పై అత్యాచార యత్నం చేసిన వాలంటీర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. Read Also:


By November 25, 2020 at 10:54AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/grama-volunteer-booked-for-attempt-rape-on-minor-girl-in-prakasam-district/articleshow/79402811.cms

No comments