క్రేజీ మల్టీస్టారర్: ఈ యాక్షన్ హీరోలు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా?
ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్‌బాబు.. అప్పట్లో వీరి కాంబినేషన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న జోడి ఒకటుంది.. అదే సుమన్- కాంబినేషన్. ఇద్దరూ యాక్షన్ హీరోలు.. పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించినవారు. దీంతో వీరి కాంబినేషన్‌పై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టే వీరిద్దరు కలిసి 9 సినిమాలు చేయడం విశేషం. ఇద్దరు కిలాడీలు 1982లో వచ్చిన ‘ఇద్దరు కిలాడీ’ సినిమాలో , భానుచందర్ తొలిసారి కలిసి నటించారు. భానుచందర్‌కి అప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండగా.. తమిళంలో అగ్రహీరోగా కొనసాగుతున్న సుమన్‌కి అదే తొలి తెలుగు చిత్రం. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా కూడా అదే. తరంగిణి సుమన్, భానుచందర్ కాంబినేషన్లో 1982లోనే తెరకెక్కిన మరో సినిమా ‘తరంగిని’. ఈ సినిమా విజయం సాధించడంతో వీరు హిట్ పెయిర్‌గా ముద్రపడిపోయారు. గడుసు పిండం 1984లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికీ వీరి క్రేజ్ వల్ల నిర్మాతకు లాభాలే తెచ్చిపెట్టింది. మెరుపు దాడి 1984లోనే విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. దీంతో వీరి కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. కుర్ర చేష్టలు 1984లోనే విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయితే ఒకే ఏడాది మూడు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించడంతో సుమన్, భానుచందర్ పేర్లు మార్మోగిపోయాయి. మొండి జగమొండి మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా 1985లో విడుదలై మంచి విజయం సాధించి వీరిద్దరి కాంబోపై అంచనాలు మరింత పెంచింది. సమాజంలో స్త్రీ 1986లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌గా ఆడినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. డాకు 1987లో విడుదలైన ‘డాకు’ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే మరో ఆరేళ్ల వరకు వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. నక్షత్ర పోరాటం 1993లో యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘నక్షత్ర పోరాటం’ సినిమా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తిరిగి వీరి కాంబినేషన్లో 1995లో మరో సినిమా ప్రకటన వచ్చినా అది సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది. ‘నక్షత్ర పోరాటం’ సినిమాకు సీక్వెల్‌కు ట్రై చేసినా అది కూడా ఆగిపోయింది. కానీ తెలుగు తెరపై సుమన్, భానుచందర్ జోడీ మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది.
By November 25, 2020 at 11:11AM
No comments